The Kashmir Files : రూ.200 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన “కాశ్మీర్ ఫైల్స్”

-

అతి తక్కువ బడ్జెట్ సినిమాగా బాలీవుడ్ లో రిలీజ్ అయిన ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. 1990లో కాశ్మీర్లో పండిట్లపై జరిగిన అరాచకాలు, అత్యాచారాలు, వలసలు ప్రధాన కథాంశంగా డైరెక్టర్ వివేక్ అగ్రహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది.

 

ఇదిలా ఉంటే కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది ‘ ది కాశ్మీర్ ఫైల్స్’. మార్చి 11న విడుదలైన ఈసినిమా 13వ రోజు కూడా రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో 13 రోజుల్లోనే ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా కలెక్షన్లలో రూ.200 కోట్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందం ప్రకటించింది.

కాగా.. వివేక్ అగ్ని హోత్రి తెరకెక్కించిన ద కశ్మీర్ ఫైల్స్ సినిమా రాజకీయ చర్చకు దారితీసింది. క‌శ్మీరీ పండిట్ల ఊచకోత కు సంబంధించి నిజాలు ఇవి అంటూ కాంగ్రెస్ పార్టీ వరుస ట్వీట్లు చేయగా.. అదే స్థాయిలో బీజేపీ కౌంటర్లు ఇచ్చింది. కశ్మీర్ ఫైల్స్ వర్సెస్ ట్రూత్ లో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. చరిత్రను కాంగ్రెస్ పార్టీ సరిగా అర్థం చేసుకోలేదు అంటూ బీజేపీ ఎంపీ కేఎల్ ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ సినిమా వివాదం కేరళ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version