ప్రతిష్టాత్మకంగా వైసీపీ ప్లీనరీ.. 9 తీర్మానాలే లక్ష్యం !

-

ఎంతో ప్రతిష్టాత్మకంగా వైసీపీ ప్లీనరీ జరుగనుంది. ఈ సారి ప్లీనరీలో 9 తీర్మానాలు ఉండనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్లీనరీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.. లక్షలాది మంది కార్యకర్తలు వస్తారు కనుక ఏర్పాట్ల పై దృష్టి పెట్టామని వెల్లడించారు.

పార్టీ అధ్యక్షుడు స్వయంగా చేసిన సంతకంతో 3,49,000 మందికి ఆహ్వానాలు పంపించామని తెలిపారు. ప్లీనరీ ఏర్పాట్ల కోసం 20 కమిటీలు ఏర్పాటు చేశాం.. కొన్ని కీలకమైన తీర్మానాలు ఉంటాయి.. పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారం కూడా ప్రధానంగా చర్చిస్తామని పేర్కొన్నారు. గత ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్ అప్పటి పరిస్థితులను బట్టి నవ రత్నాల ప్రకటన చేశారన్నారు.

రెండు రోజుల ప్లీనరీలో 9 తీర్మానాలు ప్రవేశ పెట్టనున్న పార్టీ

1. మహిళా సాధికారిక – దిశా చట్టం

2. విద్యా

3. వైద్యం

4. నవరత్నాలు – డీ బి టి

5. పరిపాలన – పారదర్శకత

6. సామాజిక సాధికారిత

7. వ్యవసాయం

8. పరిశ్రమలు – MSME – ప్రోత్సాహకాలు

9. యెల్లో మీడియా – దుష్ట చతుష్టయం

ఒక్కో తీర్మానం పైనా నలుగురి నుంచి ఐదుగురు సభ్యులకు మాట్లాడే అవకాశం

 

Read more RELATED
Recommended to you

Latest news