జుట్టు అనేది ఈ మధ్య అందరు ఎదుర్కొనే పెద్ద సమస్య. కొందరికి ఊడిపోతుంది, మరికొందరికి రాలిపోతుంది. మొత్తానికి ఉన్నది పోతుంది. కొత్తది రావటం లేదు. ఇలా జుట్టు ఒత్తుగా లేకపోవడం వల్ల దాని ప్రభావం అందం మీద పడుతుంది. ఆవ్రేజ్ గా ఉన్నా..కాస్త అందంగా జుట్టు ఉంటే..బాగుంటుంది. ఎవరు అనుకోరు కదా..బట్టతలరావాలని, జుట్టు పలచగా ఉండాలని..నల్లగా ఒత్తుగా జట్టు ఉండాలనే కొరుకుంటారు. ఇక జుట్టుకోసం మార్కెట్ లో దొరికే రకరకాల ఆయిల్స్, షాంపూలూ, కండీషనర్లు అన్నీ ఎడాపెడా వాడేస్తుంటారు. కానీ మీరు ఇక్కడ ఒక విషయం గమనించటంలేదు..అందులో అన్నీ కెమికల్స్ తో తయారుచేసినవే..మీ జుట్టుపాడైందే కెమికల్ కంటెంట్ ఎక్కువగా వాడటం వల్ల. మళ్లీ మీరు దాన్నే తెచ్చిరాస్తే..సమస్య తీవ్రత పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. దాంతో ఎన్ని వాడినా, ఏం చేసినా లాభం లేదురా బాబు అని చివరకి నిట్టూరుస్తున్నారు.
కానీ నాచురల్ గా దొరికే వాటితో..సహజంగా తయారుచేసినవాటిని మీ జుట్టుకు పెట్టారంటే..హెల్తీ హెయిర్ మీ సొంతం అవుతుంది. నాచురల్ గా జుట్టుని రక్షించే వాటిల్లో మెంతులు ఒకటి. మెంతులు జుట్టును ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయని సెంటిఫిక్ గా కూడా రుజువైంది.
1972 ఫ్రాన్స్ దేశస్తులు మెంతులు మీద ఒక పరిశోధన చేశారు. ఇక హైదరాబాద్ లో నిమ్స్ లో డయాబెటిక్స్ స్పెషల్ వైద్యులు అందరూ కలిసి ఘుగర్ కి మెంతులు నంబర్ వన్ మెడిసిన్..ఇంగ్లీష్ మందు వేసుకుంటే ఘగర్ ఎలా కంట్రోల్ అవుతుందో..ఐదు గ్రాములు మెంతులు తిన్నా అంతే కంట్రోల్ అవుతుందని వాళ్లు నిరూపించారు. చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది.
మెంతుల్లో ఉండే సౌందర్య లాభం ఏంటంటే….అసలు జుట్టుకు బేస్ పాయింట్..కుదుళ్లు..అవి ఆరోగ్యంగా ఉంటేనే ఊడకుండా ఉంటుంది. ఈ జుట్టు కుదుళ్లకు రక్తనాళాల వ్వవస్థ ఉంటుంది. బాడీలో ఏ పార్ట్ కి అయినా రక్తం వెళ్తేనే గాలీ, నీరు, ఆహారం అన్నీ వెళ్తాయి, వ్యర్థాలను తీసుకొస్తాయి…సో ఇలా ప్రతీపార్ట్ కి రాకపోకలు సరిగ్గా ఉంటేనే ఆ పార్ట్ హెల్తీగా ఉంటుంది. ఉదాహరణకు ఘగర్ పేషెంట్స్ కి కాళ్ల భాగంలో రక్తప్రసరణ బాగా దెబ్బతినేసి గ్యాంగ్రిన్ సమస్య వస్తుంది. దాంతో అంతవరకూ ఆ పార్ట్ తీసేస్తుంటారు.
ఇలానే జుట్టుకుదళ్లకు రక్తప్రసరణ వ్వవస్థ దెబ్బతింటే..ఇక జుట్టకు గాలీ, నీరు, ఆహారం వెళ్లదు. ఫలితంగా కుదుళ్లు బలహీనం అవుతాయి. ఇక మీరు ఎన్ని వాడితే మాత్రం ఏం లాభం ఉంటుంది. రక్తప్రసరణ దెబ్బతింటానికి మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లే కారణంగా అవుతున్నాయి. అవేంటంటే..
మొదటిది యాంటీబయాటిక్స్ మందులు ఎక్కువాగ వాడటం, అందిరికి తెలుసు జ్వరాలు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జుట్టు ఊడిపోతుంది అని..అందరూ జ్వరం రావడం వల్ల ఊడిందనుకుంటారు..కానీ దాని వెనుక ఉన్న అసలు కారణం..అప్పుడు వేసుకునే మందులు.
యాంటిబయాటిక్స్ వాడినప్పుడు జుట్టు కుదళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుంది.
ఇంకొంతమంది నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. దీని వల్ల కూడా జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుంది.
ఇంకా వీటితో పాటు..యాంటీ డిప్రసెంట్ మెడిసిన్ వాడుతుంటారు. మానసికంగా వీక్ గా ఉన్నవారు..నిద్రమాత్రలు వేసుకుంటారు. అప్పుడు మనకు ఎలా అయితే మగతగా ఉంటుందో..మన రక్తనాళాలు కూడా అలానే మగతగా ఉంటాయి. ముడుకుపోతాయి, సాగవు.
ఇంకా అతిముఖ్యంమైనది..సిగిరెట్, ఆల్కహాల్ తీసుకునేవారికి జుట్టుకుదళ్లకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఇలాంటి అనేక కారణాలు రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తాయి.
మెంతులు ఈ డామేజ్ ను నిరోధిస్తాయి. జుట్టు కుదుళ్లకు..b3 బాగా పనిచేస్తుంది. ఇది మెంతుల్లో ఉంటుంది. మెంతులను పేస్ట్ చేసి అది జుట్టుకు పట్టించామంటే..ఇందులో ఉండే నికోటిక్ యాసిడ్ రక్తప్రసరణ పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది. పైన చెప్పిన అలవాట్లు ఉన్నవాళ్లు..బీ3 ఉన్న ఆహారం తిన్నప్పటికి అది జుట్టుకు పట్టదు. అందుకే డైరెక్టుగా జుట్టుకు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది.
మెంతుల్లో లిసిటిన్ అనేది ఉంటుంది. ఇది జుట్టుకుదుళ్లలో డీహైడ్రేషన్ రాకుండా కాపాలా కాస్తుంది. జుట్టు కుదుళ్లలో నీటిభాగం తగ్గిపోయింది అంటే..జుట్టుకూడా డ్రై అయి విరిగిపోతుంది. చివర్లలో పగిలిపోతాయి. దాన్నే మనం హెయిర్ స్ప్లిట్స్ అంటాం. దీని ప్రధాన కారణం..శరీరానికి సరిపడా నీరు అందించకపోవడమే. దీన్ని నిరోధించడానికి మెంతులు రక్షణ కల్పిస్తాయి.
మెంతుల్ని జుట్టుకు ఎలా ఉపయోగించాలో చూద్దాం:
మెంతుల్ని జుట్టుకు రాయడానికి ముఖ్యంగా మూడు మార్గాలు ఉన్మాయి. ఈ పద్దతుల్లో ఏదో ఒకటి వారానికి రెండు మూడుసార్లు పాటిస్తే.మీకు ఆరోగ్యవంతమైన జుట్టు తిరిగి వచ్చేస్తుంది. అవేంటంటే..
మెంతుల్ని నానపెట్టేసి దాన్ని పేస్ట్ చేసి మాడుభాగం అంతా పట్టించాలి. ఇలా చేస్తే..మనం ముందు చెప్పుకున్నట్లు.. జుట్టుకుదుళ్లకు రక్తప్రసరణ జరుగుతుంది. డీ హైడ్రేట్ అవకుండా కాపాడుతుంది. ఒక అరగంట ఉంచుకుని తరువాత స్నానం చేయొచ్చు.
రెండో పద్దతి నానపెట్టిన మెంతుల్లో కాస్త పెరుగువేసుకుని పేస్ట్ చేసి తలకు పట్టించటం.
మూడో పద్దతి మెంతుల్ని దోరగా వేయించాలి. లేదా ఎండలో పెట్టినా సరిపోతుంది. తర్వాత పొడిచేసుకోండి. ఆ పొడికి కొబ్బరినూనెతో కలపండి. దీన్ని తలకు పెట్టినా మంచి ఫలితం ఉంటుంది.
ఈ మూడు పద్దతుల్లో ఏ రకంగా మెంతులను ఉపయోగించినా ఫలితం ఉంటుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది. పూర్వం రోజులనుంచి చాలామంది ఇదే పద్దతిని వాడేవాళ్లు. ఉల్లిపాయను, మెంతుల్ని మన పెద్దోళ్లు వాడేవాళ్లు. ఇప్పుడు కూడా అమ్మమ్మలు చెప్పినవాటిని మనం పట్టించుకోకుండా..ఖరీదైన ఆయిల్స్ తెచ్చి ఓ పూసేస్తుంటాం. ఇక నుంచి అయినా..జుట్టు సమస్యలు ఉన్నవాళ్లు ఈ పద్దతులను ఫాలో అయి..సమస్యను తగ్గించుకోండి.
వీటితోపాటు..చిన్నచిన్న సమస్యలకు, నొప్పులకు పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్ వాడకం తగ్గించేయండి. వీటివల్ల జుట్టు సమస్యేకాదు..అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంగా ఇలాంటి మందులు వాడటం వల్ల కిడ్నాల మీద ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి చిన్న చిన్న నొప్పులకు నాచురల్గా తగ్గించుకునే మార్గాలను పాటించటం ఉత్తమం. సమస్య తీవ్రతను బట్టి అప్పుడు మెడిసిన్ వేయొచ్చు అని ప్రకృతివైద్య నిపుణులు సూచిస్తున్నారు.
– Triveni Buskarowthu