48 ఏళ్లుగా ఎత్తిన చెయ్యి దించని సాధువు..ఎందుకు అలా చేస్తున్నాడంటే..

-

సాధువులు గురించి మనం వినే ఉంటాం..వారికి అద్భుతమైన శక్తులు ఉంటాయని..వారు శపిస్తే నిజం అవుతుందని మన నమ్మకం. ఈ సాధువుకు అద్భుత శక్తో లేక మరికెందో తెలియదు కానీ..48 ఏళ్లుగా ఎత్తిన చేయి దించలేదు. మనం అయితే కాసేపు చేయి ఎత్తితేనే నొప్పి పెట్టి దించేస్తాం. అలాంటి ఆ సాధువు ఏళ్లతరబడి అలానే ఎత్తి ఎలా ఉంచాడో కదా.. 1973లో కుడి చెయ్యి ఎత్తిన ఆయన… అప్పటి నుంచి దాన్ని అలాగే ఉంచారు. అసలు మనుషులకు ఇది సాధ్యమయ్యే పనేనా..ఒక్క క్షణం కూడా ఆ చెయ్యిని దింపలేదంటే నమ్మగలరా? ఈ ఆశ్యర్యకరమైన స్టోరీపై మీరు ఓ లుక్కేయండి.

శాంతికోసమా..

ఆయన పేరు అమర భారతి.. మీడియా పబ్లిసిటీకి ఆయన ఎప్పుడూ దూరమే..కాబట్టే.. చాలా తక్కువ మందికి ఆయన తెలుసు. ప్రపంచ శాంతి నెలకొనాలన్నది ఆయన ఆశయం. అందుకోసమే చెయ్యి ఎత్తారు. ప్రపంచ శాంతి కోసం తాను చెయ్యి ఎత్తుతున్నాననీ… ఇక దాన్ని దింపేది లేదని ఆ పరమేశ్వరుడికి మొక్కుకున్నారు. తాను చెయ్యి దింపను కాబట్టి… శాంతి నెలకొనేలా చెయ్యాలని శివుణ్ని కోరుకున్నారట. అంతే… అప్పటి నుంచి అలాగే ఉన్నారు. జనరల్‌గా మనం కుడి చేతితో చాలా పనులు చేసుకుంటాం. ఆయన చెయ్యి దింపరు కాబట్టి… ఆ పనులు చేసుకోవడం ఇబ్బందే కదా… ఇంకా చెప్పాలంటే… ఆయనకు ఆ చెయ్యి ఉన్నా లేనట్టే. ఎందుకంటే… దాన్ని ఆయన వాడట్లేదు. అంతలా ఆయన దేవుడికి మొక్కుకొని ఆ మాటపై నిలబడ్డారు.

బ్యాంక్ ఉద్యోగట..

ఆయన మొదట సన్యాసి కాదు..ఓ బ్యాంక్ ఉద్యోగట. ఆయనకు కూడా అందరిలాగే ఉద్యోగం ఉంది, భార్య, పిల్లలు ఉన్నారు. రోజూ ఉద్యోగానికి వెళ్లి అందరిలాగే జీవించేవారు. సడెన్‌గా ఓ రోజు ఏమైందో తెలియదు.. ఆయన పూర్తిగా మారిపోయారు. దైవత్వం వైపు అడుగులు వేశారు. తాను సన్యాసిగా మారుతున్నట్లు ప్రకటించుకున్నారు. అంతే… అప్పటి నుంచి తన జీవితాన్ని ఆ ముక్కంటికే అంకితం చేశారు.

48 ఏళ్ల కిందట ఏదైనా అసాధ్యమైనది చేసి… ఆ శివుడికి సమర్పించుకోవాలి అనుకున్నారట. అందుకు తన చేతిని ఎత్తి అలాగే ఉంచాలని అనిపించిందట. అసలా ఆలోచన తనకు అంతకు ముందెప్పుడూ లేదనీ… అదంతా దైవ సంకల్పం అని ఆయన అంటున్నారు. తాను అలా చెయ్యి ఎత్తి ఉంచగలగడం వెనక కూడా దైవ మహిమే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మొదట్లో ఆయన రకరకాల నొప్పులు భరించారు. కీళ్లనొప్పులు బాధించాయి. కాలం గడిచేకొద్దీ ఇక ఆ చెయ్యి అలా ఉండిపోయింది. అలా ప్రపంచ శాంతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేస్తున్నారు. అందుకే ఈ భూమిపై ఆయనో ప్రత్యేకమైన సాధువుగా నిలిచారు.

ఆయన తన పనులన్నీ ఎలా చేసుకుంటున్నాడు..తిండితిప్పలంటే..ఆ దేవుడికే తెలియాలి. ప్రపంచ శాంతి కోసం ఆ సాధువు అలా చేశాడు కానీ ఈరోజికీ…ప్రపంచంలో శాంతి ఉందంటారా?

Read more RELATED
Recommended to you

Latest news