చెప్పులను పొరపాటున కూడా ఇలా ఉంచకూడదు..ఎందుకంటే?

-

చెప్పులను వేసుకోవడం మాత్రమే కాదు..బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఒక క్రమ పద్దతిలో పెట్టాలి.. అప్పుడే గుమ్మం దగ్గరకు లక్ష్మీదేవి వస్తుందని నిపుణులు అంటున్నారు..అయితే కొన్ని కొన్ని సార్లు చెప్పులు విడిచినప్పుడు లేదంటే ఏదైనా వస్తువులు తలిగినపుడు ఈ బోర్ల పడుతూ ఉంటాయి..అయితే కొంతమంది చెప్పు బోర్ల పడగానే వెంటనే దాన్ని సరి చేస్తూ వరుసగా పెడుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం ఏమవుతుందిలే అని పట్టించుకోకుండా అలాగే వెళుతూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పులు, లేదా బూట్లు బోర్ల పడి ఉండకూడదు. అలా చెప్పులు ఇంటి ముందు పడి ఉండటం అలా అలాంటి ఇంట్లో వాస్తు దోషం ఉంటుంది. మరి ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి.అలా చెప్పులు బోర్ల పడితే ఏమవుతుంది ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం..

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చెప్పులు, బూట్లను ఎప్పుడూ తలక్రిందులు లేదా బోర్ల ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగతుంది. అదే సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఆత్మ విశ్వాసం కూడా తగ్గుతుంది. సంతోషాలకు, శాంతికి కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఇంట్లో ముందు ఉండే చెప్పులు తలక్రిందులుగా ఉంటే అవి రోగాలను ఆహ్వానిస్తాయని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. ఇంటి ముందు చెప్పులు, బూట్లు బోర్ల పడిఉంటే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీ దేవి ప్రవేశించిందట. తద్వారా ఇంట్లో ఆర్థిక సమస్యలు,చేతిలో డబ్బు నిలవక ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటి పరిస్థితులు వస్తుంటాయి..వృధా ఖర్చులు అధికం అవుతాయి.. డబ్బులు ఎలా వచ్చాయి.ఎలా పోయాయి అని లేకుండా పోవడం జరుగుతుంది.

ఇంటి ముందర తలకిందులుగా ఉండే బూట్లు, చెప్పులు కుటుంబ సభ్యుల ఆలోచనలపైనా చెడు ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మరి చెప్పులు ఎక్కడ వదలాలి అన్న విషయానికి వస్తే.. సాధారణంగా ఇళ్లలో మెయిన్ డోర్ పక్కనే చెప్పుల స్టాండ్ ఉంటుంది. ప్రధాన ద్వారానికి ఎడమ వైపు లేదంటే కుడివైపు చెప్పులు వదులుతూ ఉంటారు. చెప్పులు ప్రధాన ద్వారం వద్ద ఉంచకూడదు. ఇంటి ప్రధాన ద్వారానికి కనీసం 2 నుంచి 3 అడుగుల దూరమైనా ఉండాలి. అంతేకాదు చెప్పుల స్టాండ్ వంటి గోడ, పూజగది గోడకు ఆనికొని ఉండకూడదని గుర్తించుకోవాలి. ఇక వాస్తు ప్రకారం. చెప్పుల స్టాండ్‌కు పశ్చిమ, నైరుతి దిశలు శుభప్రదమైనవిగా భావిస్తారు.ఇక్కడ గుర్తుంచుకొవాల్సిన విషయం ఏంటంటే చెప్పుల స్టాండ్ ను ఉత్తరం, ఆగ్నేయం, తూర్పు దిశలో ఉంచకూడదు…ఇది అస్సలు మర్చిపోకండి..

Read more RELATED
Recommended to you

Latest news