తహసిల్దార్ అక్రమాలపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సర్పంచ్

-

చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ అక్రమాలపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కొత్తపల్లి సర్పంచ్. దీంతో ఎస్ఆర్ పురం తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ను విచారిస్తున్నారు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఈ సమయంలోనే తాసిల్దార్ పై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు మరికొంతమంది బాధితులు. పలు పంచాయతీలో డికెటి భూములకు సెటిల్మెంట్ పట్టాలిచ్చారు రెవెన్యూ సిబ్బంది.

 

విచారణ కొద్ది అవినీతి బాగోతం బయటపడుతుంది. తాసిల్దార్ కార్యాలయంలో తమ సమస్యను చెప్పుకోవడానికి తాసిల్దార్ దగ్గరికి వెళ్తే అసభ్య పదజాలంతో బయటికి వెళ్ళు అని అంటారు సార్ అని జెసి వెంకటేశ్వర్లకు సర్పంచులు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక వర్గం తాసిల్దార్ కు సపోర్ట్ చేస్తూ చేస్తున్నారని, మరో వర్గం అవినీతి ఎక్కువ పాల్పడుతున్నారంటూ ఈ తాసిల్దార్ వద్దు అంటూ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు. ఇలాంటి అవినీతి తాసిల్దార్ మాకొద్దు అంటూ వైసీపీ నాయకులు రెండు వర్గాల మధ్య గొడవ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news