మోదీ టూర్..విశాఖలో ఆందోళనలు..జగన్‌ని కూడా..!

-

ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో..అక్కడ ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. ఈ నెల 11వ తేదీన మోదీ విశాఖకు రానున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులుకు శ్రీకారం చుట్టనున్నారు. మోదీ పర్యటనలో సీఎం జగన్ కూడా పాల్గొనున్నారు. అయితే ఈ పర్యటన నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం..ఉద్యోగులు, పలు సంఘాలు, వామపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం..నష్టాల్లో ఉందని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరించడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది క్రితం ఈ నిర్ణయం జరిగింది..అప్పటినుంచి ఉద్యోగులు, పలు సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. మొదట్లో రాజకీయ పార్టీలు హడావిడి చేశాయి గాని, తర్వాత పట్టించుకోవడం మానేశారు. అయితే ప్రయివేటీకరణ ఆపాలని ఉద్యోగాలు సంఘాలు పోరాడుతున్నాయి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్‌ని లాభాల్లోకి కూడా తీసుకొచ్చారు. అయినా సరే కేంద్రం ప్రయివేటీకరణ వైపు మొగ్గుచూపుతుంది.

ఇదే క్రమంలో మోదీ..విశాఖ టూరుకు వస్తున్నారు..ఈ నేపథ్యం లో కార్మికులు, సంఘాల నాయకులు, వామపక్ష నేతలు ప్రయివేటీకరణ ఆపాలనే డిమాండ్‌తో బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు బ్రేకులు వేస్తున్నారు. దీంతో కార్మికులు నడుచుకుంటూనే తమ ఆందోళన నిర్వహిస్తున్నారు. తమ ఆందోళనలకు విపక్ష పార్టీలు మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రయివేటీకరణ విషయంలో సీఎం జగన్ మౌనం వీడాలని, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు.

అయితే ఇలా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఎల్లుండి ప్రధాని మోదీ పర్యటన ఏ విధంగా జరుగుతుందనేది చూడాల్సి ఉంది. ఆందోళనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటుంది. కానీ కార్మికులు మాత్రం స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతూనే ఉన్నారు. ప్రధాని మోడ్ పర్యటన ఉన్న సమయంలో ప్రతిపక్షాలు సైతం..కార్మికులతో కలిసి పోరాడే పరిస్తితి కనిపించడంలేదు. అటు అధికార పార్టీ ఎలాగో..ప్రధాని పర్యటనని విజయవంతం చేయాలని తెగ కష్టపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news