ఈటెల వ్యవహారంలో ఫస్ట్ టైం తెరాస రియాక్షన్…!

మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారంలో తొలిసారి తెరాస పార్టీ స్పందించింది. తెరాస మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈటెల కు తెరాస పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని మంత్రులు అన్నారు. ఎల్పీ లీడర్ గా రాజేంద్రకు అవకాశం ఇచ్చారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈటెలకు గౌరవం దక్కలేదు అనే మాట అబద్దం అనే వ్యాఖ్యలు కూడా ఎక్కువగానే వినపడుతున్నాయి.

ఈ రోజు ప్రభుత్వంలో పదవుల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉద్యమంలో ఉన్న వారే అని చెప్పుకొచ్చారు. పౌర సరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ ఇచ్చి గౌరవించారు అని మంత్రులు వివరించారు. ఈటెలకు ఇంకా ఎక్కడ ఆత్మగౌరవం దెబ్బ తిన్నది అని ప్రశ్నించారు. సందర్భం వచ్చిన ప్రతీసారి కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడవచ్చా అని నిలదీశారు. పార్టీలో మొదటి నుంచి ఈటెలకు మంచి ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు.