THE WARRIORR : రామ్ పోతినేని “ది వారియర్” రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్‌ పోతినేని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. స్టైలిష్ గా కనిపిస్తూనే… మాస్ పాత్రలతో అలరించే హీరో రామ్ పోతినేని. దర్శకుడు లింగుస్వామి కూడా సినిమాలకు పెట్టింది పేరు. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ది వారియర్‌ అనే టైటిల్‌ ను ఇటీవలే అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. అయితే… ఈ సినిమాలో ఉప్పెన తో ఆకట్టుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఊర మాస్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది సినీ బృందం.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. వారియర్‌ మూవీని.. జూలై 14 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఇక ఇందులో రామ్‌ పోతినేని గన్‌ పట్టుకుని.. ఊర మాస్‌ గా కనిపిస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news