యాదాద్రి లో రేపు నిజరూప దర్శనం ఇవ్వనున్న లక్ష్మి నరసింహస్వామి. ప్రపంచం లో ఎక్కడ లేని విధంగా, ఒకే శిలా (కృష్ణశిల) తో కనివిని ఎరుగని రీతిలో పునర్మితమైంది లక్ష్మి నరసింహ స్వామి దివ్యక్షేత్రం. సుందరమైన నవగిరుల మధ్య ఆధ్యాత్మిక సిరులకు రూపుదిదుకుంది యాదాద్రి. ఒక్క మాటలో చెప్పాలంటే ”నభూతో నభవిష్యతి” అన్న రీతిలో రూపుదిదుకుంది. రాజగోపురాలు, దివ్యవిమానం మొత్తం రతితో నిర్మితమైంది.
అయితే రేపు జరిగే సంప్రోక్షణలో సీఎం కెసిఆర్ కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు. యాదాద్రి లో గండభేరుండ, ఉగ్రనరసింహ, శ్రీ లక్ష్మి నరసింహ స్వయంభువుల దర్శనానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు అనగా 28 సోమవారం శ్రావణ నక్షత్ర యుక్త మిథున లగ్నంలో ఉదయం 11:55 ని, పుష్కరాంశ శుభా సమయంలో మహాకుంభ సోంప్రోక్షణ అనంతరం కోట్లాది మంది కొంగు బంగారమైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ప్రధాన ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకోనున్నాయి. మధ్యాహ్నం ౩ గంటల నుండి భక్తులకు తిరిగి దర్శనకాలు కానున్నాయి. అయితే శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి సలహాలతో, సూచనలతో వేలాది కోట్ల రూపాయలతో నిర్మితమైంది శ్రీ లక్ష్మి నరసింహ దేవాలయం.