ACHARYA : ఆచార్య నుంచి బిగ్ అప్డేట్..చరణ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న తాజా మూవీ ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… మరో జంటగా రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే నటిస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా నిర్మాత, మరో హీరో అయిన రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలోనే.. రామ్‌ చరణ్‌ కు బర్త్‌ డే ట్రీట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి చరణ్‌.. లుక్‌ ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ లో రామ్‌ చరణ్‌ చాలా అండ్సమ్‌ గా కనిపిస్తున్నాడు. కాగా.. ఈ మూవీ ఏప్రిల్‌ 29 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news