ఏళ్ల తరబడి చదివిన చదువుతందా రెండు పేజీల తెల్లకాగితంపై పెడితే అప్పుడు ఇంటర్వూవర్ మనం ఏంటో డిసైడ్ చేస్తాడు. మన ఏళ్ల కష్టం ఆ రెండు పేజీల్లో నింపుతాం..అయితే ఏ ఉద్యోగానికి అయినా రెస్యూమ్ అనేది కచ్చితంగా కావాలి. అందరూ వాళ్లకు వచ్చినట్లు నచ్చినట్లు చేస్తారు..కానీ కొందరు క్రేజీగా ఆలోచించి రెస్యూమ్‌ను వెరైటీగా చేసుకుంటారు. మొన్నామధ్య ఓ యువకుడు చాక్లెట్ రాపర్లా రెస్యూమ్‌ను తయారు చేశాడు. తాజాగా ఓ యువతి కేక్‌పై రెస్యూమ్ చేసి కంపెనీకి పంపింది..
ఓ మహిళ నైకీ కంపెనీ (Nike Company)లో ఉద్యోగం కోసం యాజమాన్యం దృష్టిని ఆకర్షించేందుకు విభిన్నంగా కేక్‌పై రెజ్యూమ్‌ను ప్రింట్ చేసి పంపింది. ఈ విషయాన్ని ఆమె లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది. కార్లీ పావ్‌లినాక్ బ్లాక్బర్న్ అనే మహిళ లింక్డ్ఇన్ పోస్ట్‌లో.. కొన్ని వారాల క్రితం తాను కేక్‌పై రాసిన రెజ్యూమ్ని నైకీ కంపెనీకి పంపినట్లు పేర్కొంది. సాంప్రదాయ పద్ధతికి విరుద్ధంగా కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఆమె లింక్డ్ఇన్ పోస్ట్‌లో క్లుప్తంగా వివరించింది.
నైకీ కంపెనీ టీం ప్రస్తుతం ఎలాంటి పోస్ట్‌లకు రిక్రూట్ చేసుకోవడం లేదు.. అయితే తన గురించి నైకీ కంపెనీ టీంకి తెలియజేయాలని భావించి విభిన్న మార్గాల కోసం ఆలోచించించిదట. అందుకే కేక్‌పై రెజ్యూమ్ ప్రింట్ చేసి పంపినట్లు వివరించింది. నైకీ కంపెనీ హెడ్ ఆఫీసులో జరుగుతున్న పెద్ద పార్టీకి కేక్ పంపడం కంటే మెరుగైన మార్గం ఏముంటుందని భావించి.అలా చేసిందంట… కార్లీ పావ్‌లినాక్ బ్లాక్బర్న్ పోస్ట్ ఇప్పుడు నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో వైరల్‌గా మారింది.
కార్లీ పావ్‌లినాక్ బ్లాక్బర్న్ చెప్పినట్లుగానే నైకీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలనే తపనతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. స్టాండర్డ్ జాబ్ అప్లికేషన్‌ను సమర్పించడం కంటే కేక్ పైన తన రెజ్యూమ్ని ప్రింట్ చేసి, ఒరెగాన్లోని బీవర్టన్లోని నైక్ వరల్డ్ హెడ్‌క్వార్టర్స్‌కు పంపింది. అయితే ఈ రెస్యూమ్ చూసి కంపెనీ ఎలా స్పందించి అనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన శైలీలో కమెంట్ చేస్తున్నారు.