దటీజ్ మెగాస్టార్ అనడానికి ఈ 10 రికార్డులే సాక్ష్యం!

-

మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎక్కడో పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించిన ఆయన.. ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీని యేలే మహారాజుగా ఎదిగారు. నటన పై ఉన్న మక్కువతో మద్రాసు(చెన్నై) కు వెళ్లిన ఆయన.. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ దర్శకుల దృష్టిలో పడ్డారు.

డ్యాన్స్​లు, ఫైట్​లతో కొత్త తరహా హీరోయిజాన్ని రుచి చూపించారు మెగాస్టార్ చిరంజీవి. టాలెంట్​కు టైమింగ్ తోడైతే దాని అవుట్-పుట్ వేరే లెవెల్​లో ఉంటుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా మెగా స్టార్ చిరంజీవి నిలిచారు.

24 క్రాఫ్ట్స్​లో ఆయనకు అవగాహన ఉంది. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటూ ఆయన.. సొంత ట్యాలెంట్​తోనే పైకి వచ్చారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్​గా నిలిచారు. ఇదిలా ఉండగా.. 42 ఏళ్ల సినీ కెరీర్ లో చిరంజీవి నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు అయితే ఆయనకు మాత్రమే సాధ్యమైన 10 రికార్డుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  1. అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ పారితోషికం అందుకున్న హీరోగా.. అదీ మొట్ట మొదటి సౌత్ హీరోగా రికార్డు సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి.
  2. 1990లలోనే ఒక్కో చిత్రానికి రూ.1.25 కోట్ల పారితోషికాన్ని అందుకుని మరే హీరోకి సాధ్యం కానీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు మన మెగాస్టార్.
  3. సౌత్ నుంచి ఆస్కార్​కు ఆహ్వానించబడిన మొట్ట మొదటి సౌత్ హీరోగా చిరంజీవి సంచలనం సృష్టించారు.
  4. ఘరానా మొగుడు సినీరంతో రూ.10 కోట్ల షేర్​ను రాబట్టిన మొదటి హీరోగా చిరు రికార్డు సృష్టించారు.
  5. ఇంద్ర సినిమాతో రూ.30 కోట్ల షేర్​ను రాబట్టిన హీరోగా కూడా రికార్డు కొట్టారు మెగాస్టార్ చిరంజీవి.
  6. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టిన ఘనత కూడా మెగాస్టార్ చిరంజీవిదే.ఈ 3 సినిమాలు కూడా ఒకదానిని మించి మరొకటి అన్నట్టు కలెక్ట్ చేశాయి.
  7. 5 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఏకైక టాలీవుడ్ హీరో చిరంజీవి. ఇప్పటికీ ఈ రికార్డుని ఏ హీరో బ్రేక్ చేయలేకపోయారు.
  8. ఇండియన్ హీరోల్లో రూ.7 కోట్ల పారితోషికం అందుకున్న మొట్టమొదటి హీరో కూడా చిరంజీవే.
  9. టాలీవుడ్లో 7 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న మొట్టమొదటి హీరో చిరంజీవి.
  10. అలాగే బాహుబలి కాకుండా ఖైదీ నెంబర్ 150తో నాన్ బాహుబలి సినిమాలతో మొట్ట మొదటి రూ.100 కోట్ల షేర్​ను కొల్లగొట్టింది కూడా మెగాస్టార్ చిరంజీవే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news