అధికంగా పాలిచ్చే గేదెల జాతులు ఇవే..!

-

మన దేశం వ్యవసాయం తో పాటు పాడి, పశుపోషణ కూడా ఎక్కువ..పాల ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంది.. ఇప్పుడు మన దేశంలో అధిక సంఖ్యలో పాలిచ్చే గేదెల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

మెహసానా జాతి గేదెలు:- ఈ జాతి గేదెలు గుజరాత్ గ్రూపుకు చెందినవి. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా పట్టణానికి చెందినవి. ఇవి ముర్రా, సూర్తి జాతి లక్షణములను పోలి ఉంటాయి. వీటి శరీరం మధ్యస్థంగా ఉండి జల్ట్ బ్లాక్ కలర్లో ఉంటాయి. ముఖము, కాళ్ళు, తోక చివరి భాగాలు గ్రే కలర్లో ఉండి తెల్లని మచ్చలు కలిగి ఉంటాయి. ఈ జాతి పశువులు సాధు స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటి కొమ్ములు సూర్తి, ముర్రా జాతిని పోలి ఉంటాయి. మెడ పొడవుగా ఉంటుంది. పొదుగు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది..

లక్షణాలు:- ఇవి 32 నెలల వయస్సులో మొదటి సారి ఎదకు వచ్చి 41 – 42 నెలలు వయస్సులో మొదటి దూడను వేస్తాయి. దూడకు దూడకు మధ్యన 16 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఒక పాడి కాలంలో 16 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి.

ధారాయి జాతి గేదెలు:- ఇవి ఉత్తర ప్రదేశ్ గ్రూపుకు చెందిన జాతి. ఇవి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ధారాయి ప్రాంతాలలో గల తరాక్ పూర్, రాంనగర్ ప్రాంతాలకు చెందిన జాతి. వీటి శరీరం అభివృద్ధి చెంది, తల కుంభాకారంగా ఉండి, నాసల్ ఎముకలు ప్రామినెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. వీటి కొమ్ములు పొడవుగా ఉండి, మెలితిరిగి చివరి కొన మొన దేలి యుంటంది. చెవులు పొడవుగా ఉంటాయి. కాళ్ళు పొట్టిగా ఉండి, బలంగా ఉంటాయి. తోక పొడవుగా హాక్ జాయింట్ వరకు విస్తరించి ఉంటుంది. చర్మం నలుపు లేదా బ్రౌన్ రంగులో ఉంటుంది. నుదురు మరియు తోక చివరి భాగాలలో తెల్లటి మచ్చలుంటాయి.

లక్షణాలు:- ఈ జాతి పశువుల పాడి సామర్ధ్యం చాలా తక్కువ. ఇవి వాటి పాడి కాలంలో 900 కిలో గ్రాముల పాలను ఉత్పత్తి చేస్తాయి. మగ పశువులను రోడ్డు రవాణాకు వ్యవసాయ పనులకు ఉపయోగిస్తూ ఉంటారు.

బధ్వారి జాతి గేదెలు:- ఇది ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా, గ్వాలియా ప్రాంతాలకు చెందిన గేదె జాతి. వీటి శరీరం మధ్యస్థంగా ఉంటుంది. చిన్న తల ఉండి కొమ్ములు దగ్గర ఉబ్బును కలిగి యుంటుంది. కాళ్ళు చిన్నగా బలిష్టంగా ఉంటాయి. శరీరం కాపర్ వర్ణలో ఉండి, వెంట్రుకలు పలుచగా ఉంటాయి. నుదురు వెడల్పుగా ఉండి కళ్ళు మెరుస్తూ ఉంటాయి. పొదుగు మధ్యస్థంగా అభివృద్ధి చెంది ఉంటుంది.

లక్షణాలు:- ఇవి ఒక పొడి కాలంలో 2000-2070 కిలో గ్రాముల పాలను ఉత్పత్తి చేస్తాయి. మగ పశువులను పని చేయుటకు వినియోగిస్తూ ఉంటారు. మొదటి దూడను 48-50 నెలల వయస్సులో వేస్తుంది. దూడకు దూడకు మధ్యన 453 రోజుల కాల వ్యవధి ఉంటుంది… వీటితో పాటు ఇంకా కొన్ని జాతులు కూడా ఉన్నాయి..వీటి ద్వారా పాల ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉండటం వల్ల డిమాండ్  కూడా ఎక్కువే..

Read more RELATED
Recommended to you

Latest news