రంజాన్ నెలలో ఉపవాసం ఉండేవారు చేయకూడని ముఖ్యమైన పనులు ఇవే..

-

ఇస్లామిక్ పవిత్ర మాసం రంజాన్ మార్చి 22న మొదలవుతుంది.ఏప్రిల్ 21న ఈద్-ఉల్-ఫితర్ పండుగ ఉంటుంది. చంద్రుడి దర్శనంతో పవిత్ర రంజాన్ మాసానికి నాంది పలుకుతుంది..ఇకపోతే తొమ్మిదో నెలలో వచ్చే రంజాన్ ను ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. రంజాన్ ఉపవాస ఆచారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రంజాన్ మాసంలో ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం ఖురాన్ స్వర్గం నుంచి భూమికి వచ్చిందని ప్రజలు నమ్ముతారు… అందుకే రంజాన్ మాసంలో ఖురాన్ ను ఎక్కువగా చదువుతారు..

ఉదయం వేల ఉదయం 4.30 లోపు భోజనం చెయ్యాలి..సాయంత్రం 6.59 నిమిషములకు ఇఫ్తార్ తో ఉపవాసాన్ని విరమిస్తారు. అయితే ఎక్కువ సమయం ఉపవాసం ఉండడం చాలా కష్టం.మండే ఎండల్లో రంజాన్ పండుగ వస్తుంది. అందుకే ఆహారంలో పుచ్చకాయ, కీర దోసకాయ, టమాటాలు వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది.ఉపవాసం ఉన్న వారంతా సూర్యాస్తమయం వరకు మంచినీరు కూడా తాగకుండా ఉండాలి.ఎందుకంటే ఆకలి విలువ అందరికీ తెలియాలి.

అంతేకాకుండా ఈ పండుగకు కొత్త బట్టలు ధరించడం, నమాజ్ చేయడం, సూర్యాస్తమయం తర్వాత కలిసి భోజనం చేయడం, పండుగ రోజున రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.. ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి..అనారోగ్యంతో బాధపడేవారు, ప్రయాణం చేసేవారు, వృద్ధులు, గర్భిణీలు, పీరియడ్స్ ఉన్నవారికి ఉపవాసం నుంచి మినహాయింపు ఉంది.. ఏదైనా గాని ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. లేకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడాలి…

Read more RELATED
Recommended to you

Exit mobile version