ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో చాలా శ్రద్ధ వహించాలి. చాలా మంది ఉదయం పూట తీసుకునే అల్పాహారంని స్కిప్ చెయ్యడం లేదా పలు తప్పులు చేయడం చేస్తూ ఉంటారు. కానీ వాటిని చెయ్యకూడదు ఎందుకంటే రాత్రిపూట 8 గంటలు టైం లో తీసుకున్న ఆహారం తర్వాత ఉదయం మళ్ళీ ఎనిమిది గంటలకు అల్పాహారంగా తీసుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. ఈ మధ్యలో పన్నెండు గంటల సమయం పడుతుంది. కాబట్టి పలు జాగ్రత్తలని తీసుకోవడం చాలా ముఖ్యం.
ఉదయం సమయంలో జ్యూస్ లు అస్సలు తీసుకోకూడదు. అలానే పులుపు కలిగిన వాటిని కూడా తీసుకోరాదు. ఒకవేళ తీసుకున్నట్లయితే పులుపు పదార్థాలు వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పులుపుకు సంబంధించిన పదార్థాలని ఎట్టి పరిస్థితిలోను తీసుకోకండి. ఇది ఇలా ఉండగా కమలాలు, నిమ్మజాతి కి సంబంధించిన పుల్లని పదార్థాలు అసలుకే తీసుకోకూడదు.
అరగడానికి టైం తీసుకునే పదార్ధాలని తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఉంటాం కాబట్టి గ్యాస్ ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. కాబట్టి మనం ప్రతిరోజు ఉదయం టైం లో అరగటానికి ఎక్కువ సమయం పట్టేటివి చూసుకుని తినాలి. లేదంటే తలెత్తే ఇబ్బందులని పడాల్సి ఉంటుంది. చపాతి, రోటి, పీచు కలిగిన బీన్స్, క్యారెట్ బీట్రూట్, చికెన్, చేప ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వలన అప్పుడు విడుదల అయిన గ్యాస్ ఆహారంపై పని చేయడం వలన జీర్ణం అవటానికి ఉపయోగ పడుతుంది. అందుకని ఇటువంటివి చూసుకుని తినండి అంతే కానీ సిట్రస్ జాతికి సంబంధించిన పదార్థాలను తీసుకోరాదని పోషకాహార నిపుణులు చెప్పడం జరుగుతున్నది.