చైల్డ్ ఆర్టిస్ట్ గా బన్నీ నటించిన సినిమాలు ఇవే..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో సంచలనం సృష్టించిన ఈయన ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే పుష్ప సినిమా ద్వారా సెలబ్రిటీల నుంచి ప్రేక్షకుల వరకు అందరూ దేశవ్యాప్తంగా పుష్ప రాజు సిగ్నేచర్ స్టైల్ ని అనుకరించడం ప్రారంభించారు. అన్ని భాషలలో కూడా విడుదలై బాక్సాఫీస్ షేక్ చేసింది ఈ సినిమా. ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పిలిపించుకుంటూ క్రమంగా ఐకాన్ స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ కొన్ని సినిమాలలో బాల నటుడిగా కూడా నటించారు.

బన్నీ బాల నటుడిగా నటించడమే కాకుండా ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడం మరో విశేషం. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్, తరుణ్ , మహేష్ బాబు లాంటి వాళ్ళు బాలనటులుగా కనిపించారన్న విషయం తెలిసిందే. అలా మహేష్ బాబు కూడా కృష్ణ నటించిన చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. హీరో తరుణ్ ఏకంగా 20 సినిమాలలో బాల నటుడిగా నటించిన విషయం తెలిసిందే. మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా బ్రహ్మశ్రీ విశ్వామిత్ర , బాల రామాయణం సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

మరి అల్లు అర్జున్ రెండు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. ఒకటి చిరంజీవి హీరోగా నటించిన విజేత సినిమా , మరొకటి కమలహాసన్ హీరోగా నటించిన స్వాతిముత్యం. ఈ సినిమాలో అల్లు అర్జున్ కమలహాసన్ మనవడిగా నటించారు. అంతేకాదు అల్లు అర్జున్ సినిమాల్లోకి రాకముందు మెగాస్టార్ హీరోగా నటించిన డాడీ సినిమాలో కూడా ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఏది ఏమైనా బన్నీ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news