బిగ్ బాస్ సీజన్ 6 జరుగుతున్న నేపథ్యంలో మూడవ వారం కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ఇక ఈ మూడవ వారంలో నేహా చౌదరి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇకపోతే ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆరోహి, వాసంతి, అతిధి వంటి వారు ఎలిమినేట్ కావాల్సి ఉండగా నేహా ను ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇకపోతే సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం నామినేషన్ లో వచ్చిన మొదటి రోజు నుంచి ఓటింగ్లో వెనుకబడి ఉంది. మొదటి రోజే డేంజర్ జోన్ లో ఉన్న నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యింది. ఇకపోతే వీకెండ్ లో ఇనాయా సుల్తానా ఇంకా ఆరోహీ రావ్ ఇద్దరూ కూడా లీస్ట్ ఓటింగ్ ఉండడం వల్ల వీళ్ళిద్దరిలో కూడా ఒకరు ఎలిమినేట్ అయినట్లుగా టాక్ వినిపించింది .కానీ మూడవ వారం నేహాను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.
ఇక నేహాను ఎలిమినేట్ చేయడానికి గల కారణాలు ఏమిటి అనే విషయానికొస్తే.. ఇక ఆమె పర్ఫార్మ్ చేస్తూ ఎప్పుడూ ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది. మొదటి టాస్క్ లో కాలు బాగోలేదని , ఆ తర్వాత ఇనయ ఫిజికల్ అయ్యిందని ఇలా కంప్లైంట్ చేయడం ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు. అంతేకాదు నేహా చౌదరి దొంగల టీంలో ఉన్నప్పుడు రేవంత్ బొమ్మలన్నీ కొట్టేద్దామని ప్లాన్ చేయడం, దొంగల టీంలో యూనిటీగా ఉండకపోవడం అనేది వారికి బాగా దెబ్బ కొట్టింది. బయటనుంచి సెలబ్రిటీలు నేహా చౌదరికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఈమె పెద్దగా గుర్తింపు సాధించలేదు. మొదటి రెండు వారాలు తన ఎగ్రేసివ్ గా గేమ్ ఆడటం కానీ లేదా ఆర్గ్యుమెంట్ చేయడం కానీ లాంటివి ఏం చేయలేదు.
ఇక మూడవ వారం నామినేషన్ లో వాసంతి తో, రేవంత్ తో వచ్చిన వాదనలో నేహా చౌదరి పాయింట్స్ మాట్లాడలేకపోయింది. అంతే కాదు ఒకే విషయాన్ని పదేపదే చెప్పడం అనేది కూడా ఆడియన్స్ కు బోర్ గా అనిపించింది. ఇకపోతే రేవంత్ తో నామినేషన్ లో వచ్చిన గొడవ , ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసుకోవడం అనేది అన్నీ ఆమెకు మైనస్ గా మారాయి.. ఇవన్నీ నేహా చౌదరికి మైనస్ గా మారడంతో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం జరిగింది.