తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ముందు.. నాలుగు జిల్లాలకు నీరు బాగా పుష్కలంగా ఉండేది. కృష్ణా నదికి ఇరువైపులా ఉన్నా కృష్ణా, గుంటూరు జిల్లా.. గోదావరి నదికి ఇరువైపులా ఉన్నా ఉభయగోదావరి జిల్లాలు. ఈ నాలుగు జిల్లాలో ముందు నుంచి కూడా పంటలు బాగా పండుతాయి., నీరు పుష్కలంగా ఉంటుంది. సంపద బాగా వస్తుంది. సంపద ఎక్కడ ఎక్కువ ఉంటుందో.. అక్కడ జీవనశైలిలో ఎక్కువ మార్పులు వస్తాయి. ఆహార పదార్థాలు తినడంలోనూ, వండుకూనే విధానంలోనూ, వ్యసనాలుకు లోనయ్యే విధానంలోనూ.. ఈ నాలుగు జిల్లాలవారు బాగా ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు.
రకరకాల రుచికరమైన పదార్థాలు..పుట్టినవి ఉభయగోదావరి జిల్లాలు తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే. ఆహార ప్రియులు ఈ నాలుగు జిల్లాల వారే ముందుంటారు. మరి ఇలా ఎంజాయ్ చేసేవారికి.. జబ్బులు కూడా బాగా రావాలి కదా.. ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నంత జబ్బులు మరే జిల్లాల్లో లేవని.. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ భారత ప్రభుత్వ వారి సూచన మేరకు పరిశోధన చేసి ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. దాదాపు 50 లక్షల పైగా 30ఏళ్లు నిండిన వారిని తీసుకుని పరిశోధన చేసి బీపీ, షుగర్ ఎంత మందిలో ఉందో టెస్ట్ చేశారు. ఆవ్రేజ్ న 26.71 శాతం బీపీ, 26 శాతం షుగర్ ఉంది. అంటే 50లక్షల మందిమీద పరిశోధన చేస్తే.. 26.40 మందికి ఈ జంటరోగాలు ఉన్నాయి అని తేలింది. ఇది ఎప్పుడో చేసిన పరిశోధన కాదు.. గడిచిన అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం మార్చి 31 వరకూ చేసిన సమాచారం. అన్నింటికంటే ముందు ఉంది.. కృష్ణా, గుంటూరు ఉంది. ఆ తర్వాత ఉభయగోదావరి జిల్లాలు ఉన్నాయి.
30 ఏళ్లు పైబడిన వారిని పరీక్షించగా..
కృష్ణాజిల్లాలో 4,83,221 మందిని పరీక్షించగా.. బీపీ 1,51,347( 31.2%), షుగర్ 1,47,547( 30.53%) మందికి ఉందని తేలింది.
గుంటూరు జిల్లాలో 4,73,640, మందిని పరీక్షించగా..బీపీ 1,44,212( 30.45%), షుగర్ 1,41,221(29.82%)కి ఉందని తేలింది.
తూర్పుగోదావరి జిల్లాలో 4,82,634 మంది పైన పరీక్షించగా.. బీపీ 1,52,518(31.60%) షుగర్ 1,44,188(29.88%) మంది ఉన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 4,66,635 మంది పైన పరీక్షించగా.. బీపీ 1,37,578(29.48%), షుగర్ 1,31,848(28.26%)కి ఉన్నట్లు గుర్తించారు.
ఈ నాలుగు జిల్లాల్లోనూ షుగర్, బీపీ ఎక్కుమ మందికి ఉంది.. మరి తక్కువ శాతం ఉన్న జిల్లాలు ఏవి అని సందేహం ఇప్పటికే వచ్చి ఉండాలే..కర్నూలు జిల్లా లీస్ట్ లో ఉంది. 2,69,437 మంది పైన పరీక్షించగా.. బీపీ 53,043(19.69%), షుగర్ 51,353(19.06%)కి ఉన్నట్లు గుర్తించారు. వీళ్లకు అంత తక్కువగా ఎందుకు ఉందని చూస్తే.. ఈ జిల్లా వారు జొన్నరొట్టెలు, రాగిముద్దు ఎక్కువగా తింటారు. ఈ మధ్య రేషన్ బియ్యం విరివిగా సప్లై చేయడంతో.. జనాలు.. వీటిని తగ్గించి వైట్ రైస్ తినడం మొదలుపెట్టారు. దానివల్ల.. ఈ కాస్త అయినా వీళ్లు ఉన్నారు. మూడు నాలుగు ఏళ్ల కిందట అయితే ఈ జిల్లా వారికి షుగర్, బీపీ తక్కువగా ఉండేది. ఎక్కడ వైట్ రైస్ వాడతారో.. అక్కడ షుగర్ ఎక్కువగా ఉంటుంది.
ఎంజాయ్ చేయడం తప్పుకాదు.. రోగాలకు బలయ్యేటట్లు చేయడం తప్పు. కాబట్టి.. వైట్ రైస్ ను తగ్గించి..వ్యాయామాలు చేస్తూ..రొట్టెలు, పుల్కాలు తినటం అలవాటు చేసుకోవడం మంచిదంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు.
-Triveni Buskarowthu