చాలా మంది బ్యాంకులలో డబ్బులు దాచుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి.. అధిక వడ్డీని పొందాలని అనుకుంటూ ఉంటారు. మనం చేసిన అమౌంట్ ని బట్టి వడ్డీ అనేది వస్తుంది. చాలా వరకు బ్యాంకులు 5 సంవత్సరాల డిపాజిట్లపై 5.50 శాతం వరకు వడ్డీని ఇస్తున్నారు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ కంటే కూడా ఈ స్కీములలో వడ్డీ ఎక్కువ వస్తుంది. పైగా పన్ను ప్రయోజనాలను కూడా మీరు పొందొచ్చు. అయితే మరి ఎఫ్డీ కంటే కూడా ఎక్కువగా ఉంటే ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.
పబ్లిక్ ప్రావిడెంట్:
ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా అనేది 15 సంవత్సరాల దీర్ఘకాల పెట్టుబడి పథకం. ఈ అకౌంట్ ని మీరు ఓపెన్ చేసిన ఏడో సంవత్సరం నుంచి పాక్షిక విత్ డ్రా కి అనుమతిస్తారు. ఈ అకౌంట్ తెరిచిన మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు లోన్ తీసుకోవచ్చు. దీనిలో మీరు 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం వార్షిక వడ్డీ 7.1 శాతంగా ఉంది. అంటే బ్యాంకు లో నుంచి వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లు మీద వడ్డీ కంటే దీనిలో ఎక్కువగా వస్తోంది.
సుకన్య సమృద్ధి యోజన:
పదేళ్ల లోపు ఆడపిల్లల పేరు పై ఈ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. అలానే పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. ఈ పథకంలో ప్రస్తుతం వార్షికంగా 7.60 శాతం వడ్డీ వస్తుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్:
60 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారు ఈ పథకంలో చేరవచ్చు. వ్యక్తిగతంగా కానీ ఉమ్మడిగా కానీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది.