ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకు ఎక్కువ అవుతుంది..ఎందుకంటే.. ప్లాస్టిక్ వస్తువులను సులువుగా క్యారీ చెయొచ్చు. అంతే కాదు ఎక్కువ ఆహార, లేదా ఇతర వస్తువులను తీసుకుని వెళ్ళవచ్చు..అవి వాడుకోవడం ఎంత సుఖంగా ఉంటుందో.. వాటి ద్వారా అనేక సమస్యలు తలెత్తవచ్చు.. అంతేకాదు పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాయి.ప్లాస్టిక్ కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడే క్రమంలో నేటి నుండి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ వాడకాన్ని నిషేధించాలని రాష్ట్రాలను కోరుతూ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది..
తాజాగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధాన్ని ఉల్లంఘిస్తే.. పర్యావరణ పరిరక్షణ చట్టం(ఈపీఏ)లోని సెక్షన్ 15, సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ల నిబంధనల కింద జరిమానా లేదా జైలుశిక్ష లేదా రెండూ ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
A quick reminder that starting today, the 1st of July, the nationwide single use plastic ban comes into effect Support nation for revolution.There will be more number of plastic items in sea than fishes (2050)#BanPlastic #CarryBags #SingleUsePlastic #saynotoplastic #NarendraModi pic.twitter.com/Ea9rJFT11w
— Tushar Mamane (@TusharMamane) June 30, 2022
సింగిల్ యూజ్-ప్లాస్టిక్ నుండి ఉత్పత్తయ్యే వ్యర్థాల సంక్షోభాన్ని అధిగమించేందుకు.. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ గత ఏడాది ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేసింది. 1జూలై 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ప్రకటించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) జూలై 1 నుండి మార్కెట్లో ఏమి నిషేధించబడుతుందో, నిషేధించిన వాటిని వాడితే ఎలాంటి పెనాల్టీ ఉంటుందో అనే విషయాలను వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. పాలీస్టైరిన్‌తో సహా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వలు, పంపిణీ, అమ్మకం, ఉపయోగం, ప్లేట్లు, కప్పులు, గ్లాసులతో సహా పలు రకాల వస్తువులు ఈరోజు నుంచి బంద్ అవుతున్నాయి..పొరపాటున కూడా ఈరోజు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వాడకండి.