మహిళల ఆరోగ్యం కోసం తప్పనిసరిగా ఈ విటమిన్స్ తీసుకోవాలి… వీటిని ఎలా తీసుకోవచ్చంటే..?

-

మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటి పనులు ఎక్కువగా ఉండటం వయసు పైబడటం మొదలైన కారణాల వల్ల ఆరోగ్యం తగ్గుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యం బాగుండాలన్నా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అలానే డైట్ లో ఈ విటమిన్స్ ని కచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి మరిక వాటికోసం చూసేద్దాం.

 

ఈ ఆరు విటమిన్స్ ని మహిళలు ఖచ్చితంగా డైట్ లో తీసుకోవాలి. వీటి వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆరోగ్యకరమైన మెటబాలిజం ని పొందొచ్చు. ఎముకల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ఐరన్:

ఐరన్ ని తప్పకుండా మహిళలు డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. శరీరమంతటికీ ఆక్సిజన్ సరిగా సప్లై అవ్వడానికి ఇది ఎంతగానో సహాయం చేస్తుంది.

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:

పండ్లు
ఆకుకూరలు
గింజలు

బీ12 :

ఇది ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కి కూడా సహాయపడుతుంది. నెర్వస్ సిస్టం ఫంక్షన్ బాగా అయ్యేటట్లు చేస్తుంది.

తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు:

మాంసం
గుడ్లు
పాలు
చీజ్
బాదం
మష్రూమ్

బయోటిన్:

బయోటిన్ జుట్టు కి చర్మానికి గోళ్ళ కి కూడా ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటుంది.

తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు:

గింజలు
నట్స్
చిలకడదుంపలు
మష్రూమ్స్
అరటిపండ్లు
బ్రోకలీ

క్యాల్షియం:

క్యాల్షియం గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు ఎముకల ఆరోగ్యానికి కూడా కాల్షియం అవసరం. సరైన నర్వస్ సిస్టమ్ కి, మజిల్ ఫంక్షన్ కి కాల్షియం ముఖ్యం.

తీసుకోవాల్సిన ఆహారపదార్ధాలు:

పాలు
టోఫు
చియా సీడ్స్
తోటకూర
బాదం
సోయాబీన్స్

మెగ్నీషియం:

మెగ్నీషియం ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలానే ఇతర ప్రయోజనాలు కూడా మెగ్నీషియం అందిస్తుంది.

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:

తోటకూర
డార్క్ చాక్లెట్
బాదం
బ్రౌన్ రైస్
అరటి పండ్లు

విటమిన్ డి:

విటమిన్ డి ఆరోగ్యకరమైన దంతాలకు అవసరం. కార్డియో వాస్క్యూలర్ ఆరోగ్యానికి కూడా అవసరం. ఎముకలకు కూడా మంచిది.

తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:

చేప
గుడ్లు
ఫోర్టిఫైడ్ మిల్క్
కమలారసం
టోఫు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version