నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు – చికోటి ప్రవీణ్

-

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆయన క్యాసినో వ్యవహారంలో వార్తల్లో నిలువగా ఇప్పుడు ఆయన ఇంట్లో జరిగిన చోరీతో ఆయన పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. సైదాబాద్ లోని చికోటి ప్రవీణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన ముగ్గురు యువకులు ఏకంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించి కారు తాళం తెచ్చి పార్కింగ్ ప్లేస్ లో ఉన్న ఇనోవా కారుని దొంగిలించారు.

 

ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తిస్తున్నారు. అయితే గతంలోనే తన ఇంటి వద్ద కొంతమంది రెక్కీ నిర్వహించారని.. తనకి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఇప్పటికే ప్రవీణ్ పోలీసులు ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

తాజాగా ఆయన కారు చోరీ కావడంతో.. తన కుటుంబ సభ్యులకు రక్షణ కావాలని ప్రభుత్వాన్ని కోరిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా తనపై రెక్కీ నిర్వహిస్తున్నారని, పోలీసులు విచారణ జరిపి సెక్యూరిటీ పెంచాలని కోరారు. ఈడీ విచారణ మొదలైనప్పటినుండి తనకి విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, క్యాసినో కేసులో కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని, తనకి ప్రత్యర్ధుల నుంచి ప్రాణహాని ఉందన్నారు. వెంటనే తనకి, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని పోలీసులను రిక్వెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news