కేవలం ఎన్నికల సమయంలోనే కాపులను వాడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ. ఏపీలో 22% ఉన్న కాపులను వాడుకునే ప్రయత్నం ప్రతిసారి జరుగుతుందన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం వైయస్ హయాంలో బయటకు వచ్చిందన్నారు. చంద్రబాబు పాలనలో దానికి న్యాయం చేశారని, కాపులకు ఏం సాధించారని జీవీఎల్ సన్మానాలు చేయించుకుంటున్నారని సొంత పార్టీ నాయకుడిపై కూడా కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు.
జీవీఎల్ పార్లమెంటులో అడిగిన సమాచారం గూగుల్ లో కొట్టిన వస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓబిసి రిజర్వేషన్లకు చట్ట సవరణ చేసి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది అన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ఓబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తే బాగుంటుందని తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకున్నది ఆయనే నిర్ణయించుకుంటాడని అన్నారు. బయట నుంచి ఎవరు ఆయనని ప్రభావితం చేయవద్దని సూచించారు.