కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే కేటీఆర్ నిరుద్యోగులను తప్పుదారి పట్టించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ విషయంలో రాహుల్ గాంధీపై సెటైర్ వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పొన్నం కౌంటర్ ఇచ్చాడు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ ఎన్ని ఇద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు,పార్టీ కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన పొన్నం..పదవి, అధికారం పోయిన అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అసత్య ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రతిపక్ష హోదాలో ప్రజల తరఫున ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని అడిగారు.ఈ దసరా పండుగకు అయిన కేటీఆర్ కు మంచి బుద్ది ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తానని మంత్రి తెలిపారు.