కేంద్రం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. కేంద్రం వివిధ రకాల స్కీములని తీసుకు వచ్చింది. వీటి వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. 2023 లో డిజిటల్ టెక్నాలజీ సహాయంతో కేంద్రం వీధి వ్యాపారులకు రూ.5,000 వరకు మైక్రో లోన్ సౌకర్యం కల్పించడంపై దృష్టి పెడుతోందని అశ్విని వైష్ణవ్ అన్నారు. వీధి వ్యాపారుల అవసరాల కోసం కేంద్రం 2023లో రూ.3,000 నుంచి రూ.5,000 వరకు సూక్ష్మ రుణాలని ఇస్తుందని చెప్పారు.
దేశం లోని అన్ని ప్రాంతాలకు 4జీ, 5జీ టెలికాం సేవలను అందించడానికి కేంద్రం దాదాపు రూ.52 వేల కోట్లను కేటాయించారని చెప్పారు. ప్రతి పౌరుడిని డిజిటల్‌గా అనుసంధానం చేసినట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ ప్లాంట్‌ను త్వరలో ఏర్పాటు చేస్తున్నారట. టెక్నాలజీ రంగంలో భారత్‌ను స్వావలంబనగా మార్చాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు అందంగా ఉండాలని అవసరాలను తీర్చాలని పీఎం స్వానిధి పథకం ని తీసుకు వచ్చారు. పీఎం స్వానిధి పథకం చివరి తేదీ 2024 వరకు పొడిగించారు. ఇది వరకు చివరి తేదీ 31 మార్చి 2023 వరకు చివరి తేదీ ఉండేది. దాన్ని 2024 వరకు పొడిగించారు. జూన్ 2020లో ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ సెల్ఫ్-రిలెంట్ ఫండ్ స్కీమ్ ని కేంద్రం తీసుకు వచ్చింది. కరోనా సమయంలో వీధి వ్యాపారులకు ప్రయోజనం కలగాలని ఈ స్కీమ్ ని అప్పుడు కేంద్రం తీసుకు వచ్చారు.