ఎన్నటికీ తీరని కలగా కృష్ణ జీవితంలో మిగిలిపోయినది ఇదే..

-

అలనాటి అందాల నటుడు సూపర్ స్టార్ కృష్ణ యావత్ తెలుగు ప్రజలను దుఃఖ సాగరంలో ముంచి దివికేగిన సంగతి తెలిసిందే.. తన జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన కృష్ణ సంతృప్తి గల జీవితాన్ని గడపారానే చెప్పవచ్చు. అయితే ఇన్ని సినిమాల్లో నటించినా.. కోట్ల ఆస్తిని సంపాదించినా.. తన పిల్లల్ని ఇంతటి ప్రయోజకుల్ని చేసినా.. ఆయన జీవితంలో కొన్ని ఆశలు, కోరికలు మాత్రం అలానే ఉండిపోయాయని చెప్పవచ్చు..

ఆకాశంలో ఒక తార.. నాకోసం వచ్చింది ఈవేళ.. అంటూ సినీ ప్రియల్ని ఓ ఓపు ఊపేసిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. అలాంటి నటుడు చనిపోవడం అందరికీ ఎంతో బాధ కలిగించే విషయం అనే చెప్పాలి. ఆయన పిల్లలు అందరూ మంచి స్థాయిలో స్థిరపడ్డారు. తనయుడు మహేష్ బాబు తండ్రి పేరు నిలబెడుతూ తెలుగులో సూపర్ స్టార్ గా ఎదిగారు.. అలాగే ఆయన ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరూ నిర్మాణ రంగంలో కొనసాగుతున్నారు.. ఇంత జీవితాన్ని చూసినా కృష్ణ జీవితంలో కూడా కొన్ని ఆశలు, ఆలోచనలు తీరకుండా ఉండిపోయాయని తెలుస్తోంది.. తన సినీ జీవితంలో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ.. 350 సినిమాల్లో హీరోగానే చేశారు. అలాగే ఎక్కువ మల్టీస్టారర్ మూవీలో నటించిన స్టార్ హీరోగా కూడా నిలిచిపోయారు.. ఇన్ని సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసిన ఆయనకి ఓ పాత్ర మాత్రం చేయలేదని అసంతృప్తి ఉండిపోయింది అంట.

అదే ఛత్రపతి శివాజీ ఈ పాత్రతో ఆయన ఒక సినిమాను చేయాలని ఎన్నో సార్లు అనుకున్నారట. అయితే తాను ఈ సినిమా చేస్తే భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య గొడవలు వస్తాయి ఏమో అని ఆలోచించి ఆగిపోయారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.. ఆయన నటించిన చంద్రహస్ చిత్రంలో కాసేపు చత్రపతి శివాజీ గా కనిపించి ఆ కోరికను తీర్చుకున్నప్పటికీ పూర్తిస్థాయి పాత్రను చేయలేకపోయానని అసంతృప్తి ఉండేదట.. అలాగే సూపర్ స్టార్ గా ఎదిగిన తనయుడు మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో మంచి పాత్రలను చేసిన ఆయన్ను పూర్తిస్థాయి బాండ్ పాత్రలో చూడాలని అనుకున్నారు కృష్ణ.. అలాగే తన మనవడు గౌతమ్ కృష్ణ తో కలిసి ఓ సినిమాలో నటించాలని కూడా కృష్ణ అనుకునేవారట. అయితే ఈ కోరికలు ఏవి కూడా ఆయన జీవితంలో నెరవేరకుండానే ఆయన నింగికేగారు..

Read more RELATED
Recommended to you

Latest news