వారి ఆధార్ కార్డులు రద్దు…!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ఆధార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆధార్ తో చాలా రకాల సేవలు పొందొచ్చు. రేషన్ కార్డు నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వరకు ఆధార్ కార్డు తప్పని సరి. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కీముల ప్రయోజనాలని పొందడానికి కూడా ఆధార్ కార్డు కావాలి.

ఆధార్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్‌. అయితే చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది.. వ్యక్తి మరణించిన తర్వాత వారి ఆధార్ కార్డు ఏం అవుతుంది అని.. మరి ఆ విషయమే ఇప్పుడు చూద్దాం. ఆధార్ ప్రాధికార సంస్థ యూఐడీఏఐ కొత్త విధాన్నాన్ని తీసుకు వస్తోంది.

వివరాలని చూస్తే.. చనిపోయిన వారి ఆధార్ కార్డు వెంటనే రద్దు చేసేలా కొత్త సర్వీసులు ని తీసుకు రావాలని చూస్తున్నారు. యూఐడీఏఐ దీని కోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొత్త విధానం ని తీసుకు వస్తోంది. వ్యక్తి మరణించినప్పుడు వారికి డెత్ సర్టిఫికెట్ జారీ చేసాక ఆధార్ కార్డు కూడా రద్దు అవుతుంది.

డెత్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తే ఆ విషయం మరణించిన వారి కుటుంబాలకు చేరవేస్తారు. ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేస్తారు. అప్పుడు చనిపోయిన వాళ్ళ ఆధార్ ఇక పని చేయదు. ఆధార్ 2.0 కార్యక్రమంలో భాగంగా కొత్త సర్వీసులని కూడా తెచ్చింది. పదేళ్ల లో ఆధార్ కార్డు వివరాలు అప్‌డేట్ చేసుకోని వారికి ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ సేవలు అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version