సిస్టమ్‌ ముందు పనిచేసే వాళ్లు అసలు వైట్‌ రైస్‌ తినొద్దా..! మరి ఏం తినాలి..?

-

సిస్టమ్‌ ముందు వర్క్‌ చేసే వారికి..వైట్‌ రైస్‌ తినడం మంచిది కాదు.. రోజులో ఒక్కసారి తిడనమే ఎక్కువ. అలాంటిది కొంతమంది మూడుపూట్లా తింటారు. రైస్‌ కూడా.. పాలిష్‌ పట్టనది అయితేనే మంచిది. రెడ్‌ రైస్‌, బ్రౌన్‌, బ్లాక్‌ రైస్‌ మార్కెట్‌లో వస్తున్నాయి. అయితే అందరికి బ్రౌన్‌ రైస్‌ మీద ఉన్నంత అవగాహన బ్లాక్‌ రైస్‌ మీద లేదు. అసలు చూడ్డానికి కూడా ఇది మంచిగా ఉండదు. దాంతో తినడానికి ఎవరూ ఇష్టపడరు. బ్రౌన్‌ రైస్‌ కంటే బ్లాక్‌ రైస్‌ మంచిదా..? ఇందులో ఏం ఏం ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా.!
బ్లాక్‌ రైస్‌పై బాపట్ల అగ్రికల్చరల్‌ కాలేజ్‌ వారు పరిశోధన చేసి ఇచ్చారు. ఇందులో పవర్‌ ఫుల్‌ యాంటి ఆక్సిడెంట్స్‌ ఉన్నాయని నిరూపించారు. బ్లాక్‌ రైస్‌ పేరుకు తగ్గట్టే నల్లగా ఉంటాయి. ఆంధ్రాలో కూడా వీటిని పండిస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలో గోమూత్రంతో వీటిని పండిస్తున్నారు.

100 గ్రాముల బ్లాక్‌ రైస్‌లో ఉండే పోషకాలు

355కాలరీల శక్తి ఉంటుంది.
కార్భోహైడ్రేట్స్‌ 75.5 గ్రాములు ఉంటాయి.
ప్రొటీన్ 9 గ్రాములు
ఫ్యాట్‌ 3.3 గ్రాములు
ఫైబర్‌ 2.5 గ్రాములు
గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ 42
ఇందులో 23 రకాల యాంటీఆక్సిడెంట్స్‌ ఉన్నాయని సైంటిస్టులు చెప్పారు. కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది దశల వారీగా అరుగుతుంది. బ్లడ్లో ఒకేసారి షుగర్‌గా కన్వర్ట్‌ అవదు. లివర్‌ను యాక్టీవేట్‌ చేయడానికి మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు, షుగర్‌ పేషెంట్స్‌, కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు తగ్గాల్సినవారు రైస్‌ ఐటమ్‌ తినే అర్హత లేదు. కేవలం రొట్టె తినాలి. వారు అప్పుడప్పుడు ఈ బ్లాక్‌ రైస్‌ తింటే ఆరోగ్యానికి మంచిది.!
కాలం మారే కొద్ది.. రోగాలు పెరుగుతున్నాయి.. ఏజ్‌ ఎక్కువ అవుతుంది.. సంపాదనలో బిజీగా ఉంటూ.. ఆరోగ్యం మీద శ్రద్ద తగ్గుతుంది. వెరసీ.. కొన్నాళ్లకే.. బోలెడు రోగాలు. ఈరోజుల్లో ఎంత సంపాదిస్తే.. అన్ని రోగాలు అన్న చందంగా తయారైంది. మీరు అలా కాకూడదు అనుకుంటే.. ముందు నుంచే.. పాలిష్‌ పట్టిన వైట్‌ రైస్‌కు దూరంగా ఉంటూ.. హెల్తీ లైఫ్‌ స్టైల్‌ మెయింటేన్‌ చేసుకోవడం మంచిది.!

Read more RELATED
Recommended to you

Exit mobile version