ఈ సమస్యలు ఉన్నవారు బీట్ రూట్ కి దూరంగా ఉండండి..!

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా బీట్ రూట్ రుచి నచ్చకపోయినా చాల మంది ఆరోగ్యంగా ఉండడానికి తీసుకుంటారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో…! రక్త హీనత సమస్య తో బాధ పడేవారు బీట్ రూట్ తినడం వల్ల వారి శరీరం లో రక్తం వృద్ధి చెందుతుంది. అలానే పచ్చి బీట్ రూట్ తినడం వల్ల అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి. జ్యూస్ రూపం లో తీసుకోవడం వల్ల వెంటనే మన శరీరానికి శక్తి కూడా అందుతుంది. దీని మూలం గానే క్రీడాకారులు ఎక్కువగా బీట్ రూట్ జ్యూస్ ను తాగుతుంటారు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

బీట్ రూట్ లో ఐరన్ శాతం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తం అభివృద్ధి చెంది రక్తహీనత సమస్యని తగ్గిస్తుంది. చూసారా దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..! అయితే బీట్ రూట్ వల్ల ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటే అది పొరపాటే..! బీట్ రూట్ ను కొన్ని అనారోగ్య సమస్యల తో బాధ పడేవారు తినకూడదని నిపుణులు చెబుతారు. అయితే ఎవరు దీనిని తీసుకోకూడదు…?, తీసుకుంటే కలిగే నష్టాలు ఏమిటి..? మరి వీటి కోసం ఇప్పుడే చూసేయండి.

మీకు కనుక హెమో క్రొమోటోసిస్, వీసర్ వ్యాధి ఉంటె అస్సలు దీనిని తీసుకోకూడదు. ఒకవేళ బీట్ రూట్ ని అధికంగా తీసుకుంటే… దీని వల్ల శరీరంలో ఎక్కువ శాతం ఐరన్ నిల్వ ఉంటాయి. శరీరం లో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మూత్రం ఎరుపుగా రావడం వంటి సమస్యలు వస్తాయి. రక్తపోటు సమస్యకు మందులు వాడే వారు బీట్ రూట్ తినడం వల్ల వారి శరీరం లో రక్తపోటు తక్కువ పడిపోయి ఇబ్బందులు పడాల్సి ఉంది. కనుక రక్తపోటుకు మందులు వాడే వారు దీనికి దూరంగా ఉంటె మంచిది.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...