URI Sectorలో ముగ్గురు ఉగ్రవాదులు హతం

-

జమ్ముకశ్మీర్‌లోని ఉరీ (URI) సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. నియంత్రరేఖ వెంబడి ముగ్గురు ఉగ్రవాదులు దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కశ్మీరీ పోలీసులు ఆ ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఘటన బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లోని మదియాన్ నానక్ పోస్ట్ సమీపంలో చోటు చేసుకుంది.

army-loc

నియంత్రణ రేఖ వద్ద ముగ్గురు ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు నిఘా పెట్టిన పోలీసులు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేశారు. ‘భారత భూభాగంలో ఉగ్రవాదుల కదలికలు గుర్తించాం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. రెండు ఏక్-47 రైఫిళ్లు, ఎం-16 రైఫిల్-1, మందుగుండు సామగ్రిలు స్వాధీనం చేసుకున్నాం’ అని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version