ఒక చోట ఉండి.. మరొకరితో కాపురం చేయద్దు.. టీఆర్‌ఎస్‌ నేతలపై తుమ్మల సంచలనం

-

ఒక చోటు ఉండి.. మరొకరితో కాపురం చేయద్దని టీఆర్‌ఎస్‌ నేతలపై తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది పార్టీని నాశనం చేయాలని చూశారని.. పార్టీ పరువు పోకుండా ఎమ్మెల్సీని గెలిపించారని తెలిపారు. ఒక చోట ఉండి మరొక చోట కాపురం చేయడం మంచిదికాదు..ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలని టీఆర్‌ఎస్‌ పార్టీలోని కొంత మంది నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు.

పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడబోమని… భవిష్యత్‌లో అందరూ కలిసి ప్రయాణం చేయాలని సవాల్‌ విసిరారు తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి రాష్ట్రంలో అశ్వారావుపేట నియోజకవర్గ లో జరిగిన అభివృద్ధి ఎక్కడ జరగలేదని… ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జీలుగుమిల్లి రోడ్డు చాలా దారుణంగా ఉందన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి తో మాట్లాడిన అక్కడ పని చేసేవాడు లేడని తెలిపారు. తనను ఈ స్థాయికి తిసు కొచ్చిన అశ్వారావుపేట సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తుమ్మల పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version