టైమ్ మ్యాగజీన్ తాజా నివేదిక.. ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలివే!

-

టైమ్ మ్యాగజీన్ తాజా నివేదికను వెల్లడించింది. ప్రపంచంలోనే 50 గొప్ప ప్రదేశాల జాబితాలను విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన అహ్మదాబాద్ నగరం, కేరళ రాష్ట్రం చోటు సంపాదించుకున్నాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు పర్యాటకం, కొత్త మానవ సంబంధాల ద్వారా ఉత్సాహం లభిస్తోంది. 2022లో అన్వేషించాల్సిన అసాధారణ గమ్యస్థానాలు ఇవేనంటూ టైమ్ మ్యాగజీన్ తాజాగా వెల్లడించింది.

కేరళ పర్యాటకం
కేరళ పర్యాటకం

యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించింది. సబర్మతి నది తీరాన ఉన్న గాంధీ ఆశ్రమం, సైన్స్ సిటీ, రోబోటిక్ గ్యాలరీ, నవరాత్రి ఉత్సవాలు, యోగా సాధనకు ఇక్కడున్న సదుపాయాల గురించి టైమ్ ప్రత్యేకంగా పేర్కొంది. అలాగే కేరళను భారత్‌లోని అత్యంత అందమైన రాష్ట్రంగా పేర్కొంది. కేరళను దేవభూమిగా వెల్లడించింది. ఇక్కడ అద్భుతమైన బీచులు, దేవాలయాలు, రాజ భవనాలు, జలాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఈ టైమ్ జాబితాలో ఉటాలోని పార్క్ సిటీ, యూఏఈలోని రస్‌అల్ ఖైమా, జాంబియాలోని లోయర్ జంబేజి నేషనల్ పార్క్, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ ప్రాంతాలకు చోటు దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news