పీరియడ్స్ ముందుగా రావాలంటే ఇలా చేయండి..!

-

మీ పీరియడ్స్ సమయం దాటి పోయిందా..? వెంటనే పీరియడ్స్ రావాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టిప్స్ మీకోసం..! ఇలా పాటించడం వల్ల వేగంగా పీరియడ్స్ వస్తాయి.

 

విటమిన్ సి:

విటమిన్ సి తీసుకోవడం వల్ల పీరియడ్స్ పై ప్రభావం చూపుతుంది. ఇది ఈస్ట్రోజన్ లెవెల్స్ ను పెంచుతుంది మరియు ప్రొజెస్టిరాన్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఈ కారణంగా యూట్రస్ లైనింగ్ బ్రేక్ అయ్యి పీరియడ్స్ రావడానికి వీలవుతుంది. కనుక ఎక్కువగా విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి.

బొప్పాయి :

ముందుగా పీరియడ్స్ రావడానికి బొప్పాయి బాగా పనిచేస్తుంది. పచ్చిగా ఉండే బొప్పాయిని రోజుకి రెండు సార్లు భోజనం అయ్యిన తర్వాత తీసుకోండి. మీరు కావాలంటే బొప్పాయి రసం కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు పీరియడ్స్ ముందుగా వస్తాయి.

అల్లం:

అల్లం టీ తీసుకోవడం వల్ల కూడా ఇది మంచి ప్రభావం చూపుతుంది. అల్లం ఒంట్లో వేడి ఇచ్చి పీరియడ్స్ త్వరగా రప్పిస్తుంది. అలా అని అధికంగా అల్లాన్ని తీసుకోకండి. అధికంగా తీసుకున్నట్లయితే ఎసిడిటికి కారణం అవుతుంది.

పసుపు:

పసుపు లో ఎన్నో మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీనిని వివిధ రకాలుగా మీరు తీసుకోవచ్చు. గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఐదు నుంచి పది రోజుల ముందే పీరియడ్స్ వచ్చేస్తాయి.

ఖర్జూరం:

ఖర్జూరం కూడా ఒంట్లో వేడిని పెంచుతాయి మీ పీరియడ్స్ వేగంగా రావడానికి ఎక్కువగా ఖర్జూరం తీసుకోండి. ఇలా ఈ చిట్కాలు పాటిస్తే మీ పీరియడ్స్ ముందుగా రావడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version