జానారెడ్డి లేదా…? జీవన్ రెడ్డి…?

-

తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ఎవరిని అధ్యక్షుడిగా ఎంపిక చేస్తుందనేది తెలియకపోయినా రేవంత్ రెడ్డి మాత్రం ఆ పదవిలోకి దాదాపుగా వెళ్లే అవకాశాలు లేవు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి వలన పార్టీలో కొన్ని సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి అనే భావన కూడా కొంతమందిలో ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం… ఆ పాదయాత్ర విషయంలో సీనియర్ నేతలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడంతో చాలా మంది నేతలు రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు కూడా పంపినట్లుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తీవ్రంగానే ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే కూడా జానారెడ్డి లేదా జీవన్ రెడ్డి పేర్లనే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీవన్ రెడ్డి తో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం చర్చలు జరిపింది. రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version