కొరియన్‌ గ్లాసీ లుక్‌ ని పొందాలంటే.. ఇలా చేయండి..!

-

కొరియన్ గ్లాస్ స్కిన్ ని పొందాలని చాలామంది ట్రై చేస్తున్నారు మీరు కూడా కొరియన్ గ్లాస్ స్కిన్ ని పొందాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేస్తే ఈజీగా మీరు కొరియన్ గ్లాస్ స్కిన్ పొందొచ్చు. బియ్యం కడిగిన నీళ్లు అందుకు సహాయం చేస్తాయి. రైస్ వాటర్ చర్మాన్ని ఎంతో అందంగా మార్చగలవు హైడ్రేట్ గా ఉంచుతాయి నేచురల్ గా ఇది పని చేస్తుంది ఒక కప్పు నీళ్లలో ఒక చెంచా బియ్యం వేసి అరగంట పాటు నానబెట్టి ఆ తర్వాత ఆ నీటిని వడకట్టేసి ముఖంను ఆ నీటితో శుభ్రం చేసుకుంటే ఫేస్ వాష్ లాగా పని చేస్తుంది తేమగా హైడ్రేట్ గా మీ ముఖాన్ని ఉంచుతుంది.

అందమైన చర్మాన్ని పొందడానికి గ్రీన్ టీ కూడా బాగా ఉపయోగపడుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి గ్రీన్ టీ పొడి వేసి మీరు నీళ్ళని బాగా మరిగించి చల్లారిన తర్వాత ఐస్ క్యూబ్ ట్రే లో పోసి ఫ్రీజర్ లో ఉంచండి ఈ ఐస్ క్యూబ్ తో చర్మాన్ని మసాజ్ చేయడం వలన రంధ్రాలు తొలగిపోతాయి.

కాంతివంతంగా చర్మం మారుతుంది గ్లోయింగ్ స్కిన్ పొందడానికి కస్తూరి పసుపు లో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కలపండి. మృదువుగా మీ ముఖానికి దీనితో మసాజ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కొరియన్ గ్లాస్ స్కిన్ ని పొందడానికి బంగాళదుంపల్ని తొక్క తీసి సన్నగా ముక్కలు కింద కట్ చేసుకుని కళ్ళపై ఉంచి రెస్ట్ తీసుకోండి రిలాక్స్ గా ఉంటుంది డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో కొరియన్ గ్లాస్ స్కిన్ ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version