గుండె జబ్బులకి దూరంగా ఉండాలంటే.. ఈ మిల్క్ ని తప్పక తీసుకోండి..!

-

ఈ మధ్యకాలంలో చాలా మంది అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసు లోనే గుండె జబ్బులతో బాధపడుతున్నారు హృదయ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం లేదంటే ఎంత గానో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలు లేకుండా చూసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్య నిపుణులు మనతో కొన్ని విషయాలని పంచుకున్నారు. మరి వాటిని చూసి అనుసరించండి.

సోయా మిల్క్:

సొయా మిల్క్ ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెకి కూడా ఇది మేలు చేస్తుంది. ఇందులో సంతృప్తి కొవ్వులు తక్కువ ఉంటాయి. కొలెస్ట్రాల్ ని కూడా ఇది తగ్గిస్తుంది. సోయా మిల్క్ లో 80 క్యాలరీలు పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఖనిజాలు, విటమిన్స్ ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే సోయా మిల్క్ ని తీసుకోండి.

బాదం మిల్క్:

అలానే బాదం మిల్క్ లో పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ ని ఇది తగ్గిస్తుంది. దీన్ని కూడా తీసుకోండి.

ఓట్ మిల్క్:

ఓట్ మిల్క్ కూడా ఆరోగ్యానికి మంచిదే. ఆహారాన్ని త్వరగా శక్తిగా మారుస్తుంది ఇది. కొలెస్ట్రాల్ ని కూడా ఓట్ మిల్క్ తగ్గిస్తుంది.

బియ్యం నుండి తీసిన పాలు:

ఇవి కూడా తీసుకుంటూ ఉండండి. ఆరోగ్యనికి చాలా మంచిది. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆవు పాలలో ఉన్నంత కాల్షియం బియ్యం పాలలో ఉంటుంది సో మీరు దీన్ని కూడా తీసుకోవచ్చు. చూసారు కదా ఆరోగ్య నిపుణులు చెప్పిన చిట్కాలని మరి వీటిని మీరు డైట్ లో చేర్చుకుని గుండె జబ్బులకి దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news