Breaking : ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు మల్లికార్జున ఖర్గే. దీంతో ఏఐసిసి ప్రాంగణంలో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి హాజరుకానున్నారు ఏఐసిసి మాజీ అధ్యక్షలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రస్తుత, మాజీ సి.డబ్ల్యు.సి సభ్యులు, ప్రస్తుత, మాజీ ఏఐసిసి జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు,
పిసిసి అధ్యక్షలు, ప్రస్తుత, మాజీ పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ సి.ఎల్.పి లీడర్లు. ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల నిర్వహణలో కీలక భాగస్వాములైన “ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్లు” ( పిఆర్ఓ), అసిస్టెంట్ ఏపిఆర్ఓలు కూడా ఆహ్వానం అందుకున్నారు. ఈ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షురాలు గా సోనియా గాంధీ చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఖర్గే కు సర్టిఫికెట్ ను అందజేయనున్నారు “ఏఐసిసి సెంట్రల్ ఎన్నికల అధారిటీ” ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ. ఆ తర్వాత, ఏఐసిసి అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా పార్టీ నాయకులనుద్దేశించి ప్రసంగించనున్న మల్లిఖార్జున్ ఖర్గే.