నేడు థీయేట‌ర్‌లో, ఓటీటీలో విడుద‌ల చిత్రాలు ఇవే

-

తెలుగు రాష్ట్రాల సినిమా ప్రేక్షకుల‌కు గుడ్ న్యూస్ ఈ రోజు రెండు భారీ సినిమాలు ఓటీటీలో విడుద‌ల అవుతున్నాయి. అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా ఓటీటీ లో విడుద‌ల అవుతుంది. వీటితో పాటు ప‌లు చిన్న సినిమాలు నేడు థీయేట‌ర్స్ లో విడుద‌ల అవుతున్నాయి. ముందుగా ఓటీటీలో విడుద‌ల అయ్యే వాటి గురించి చూద్దం.

అఖండ : నంద‌మూరి హీరో బాల‌య్య‌, యాక్ష‌న్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో వ‌చ్చిన అఖండ ఈ రోజు ఓటీటీలో విడుద‌ల అవుతుంది. డిస్పీ ప్ల‌స్ హాట్ స్టార్ అనే ఓటీటీలో ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల కానుంది. ఈ సినిమా ఇటీవ‌ల 50 రోజుల ఫంక్ష‌న్ ను ముగించుకుంది. అలాగే రూ. 200 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల ను రాబ‌ట్టింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురు చుస్తున్నారు.

శ్యామ్ సింగ‌రాయ్ : నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌చ్చిన సినిమా శ్యామ్ సింగ‌రాయ్. ఈ సినిమా గ‌త ఏడాది డిసెంబ‌ర్ 24 విడుద‌ల అయింది. అయితే ఈ రోజు నెట్ ఫ్లిక్స్ అనే ఓటీటీలో విడుద‌ల కానుంది.

లూస‌ర్ 2 : కామెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌లో లూస‌ర్ సిజ‌న్ 2 అనే వెబ్ సిరీస్ జీ5 లో ఈ రోజే విడుద‌ల అవుతుంది. గ‌తంలో వ‌చ్చిన లూస‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకోవ‌డంతో రెండో సిజ‌న్ ను తెర‌కెక్కించారు.

వీటితో పాటు థీయేట‌ర్స్ ల‌లో వ‌ర్మ.. వీడు తేడా తో పాటు వ‌ధు క‌ట్నం, ఉనికి అనే సినిమాలు విడుద‌ల అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news