టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ డైరెక్టర్‌ ఇకలేరు

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగా ఇటీవల ప్రముఖ నటుడు శరత్ బాబు మృతి చెందగా.. తాజాగా సీనియర్ దర్శకుడు కే. వాసు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కాగా, కే. వాసు మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలిచిత్రం ప్రాణం ఖరీదు చిత్రానికి కే. వాసు దర్శకత్వం వహించారు. అమెరికా అల్లుడు, శ్రీషిరిడీ సాయిబాబా మహత్యం, ఇంట్లో శ్రీమతి వీధిలోకుమారి, అల్లుళ్లొస్తున్నారు వంటి పలు హిట్ చిత్రాలకు కే. వాసు దర్శకుడిగా పనిచేశారు.

Tollywood Director K Vasu Passed Away - Sakshi

కే.వాసు తండ్రి ప్రత్యగాత్మ ఆయన సోదరుడు హేమాంబరధరరావు ఇద్దరూ కూడా దర్శకులే. టాలీవుడ్లో ఎన్నో మంచి సినిమాలను వీరు రూపొందించారు. తండ్రి, బాబాయ్ బాటలో నడిచిన వాసు కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రాణం ఖరీదు సినిమా కే.వాసుకు మంచి పేరు తీసుకొచ్చింది. విజయ చందర్ శిరిడి సాయిబాబా పాత్రలో తెరకెక్కించిన ‘శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, వాసు కెరీర్‌లో మలుపు అని చెప్పొచ్చు. చివరగా ఈయన పోసాని కృష్ణ మురళితో ‘తింగరోడు’ సినిమాను తెరకెక్కించారు.