టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్‌..సినీ తారల కాల్‌ డేటా బయటపెట్టిన ఎక్సైజ్‌ శాఖ

-

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో పలుగురి కాల్‌ డేటా బయటపెట్టింది ఎక్సైజ్‌ శాఖ. టాలీవుడ్ డ్రగ్స్ పై లోతుగా ఈడి దర్యాప్తు చేస్తోంది. 2017 టాలీవుడ్ డ్రగ్స్ కేస్ లో ఆడియో విడియో రికార్డింగ్స్ మాయం అయ్యాయి. 2017 లో టాలీవుడ్ స్టార్స్ తో పాటు మొత్తం 41 మంది కాల్ డేటా రికార్డింగ్స్ నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ.. వీరిపై 2017 లో 12 ఎఫ్ ఐ ఆర్లు నమోదు చేసింది.

డ్రగ్స్ నిందితుల తో పాటు సాక్షుల నుండి కాల్ డేటా రికార్డింగ్స్ తీసుకున్నామని ఈడి కి ఎక్సైజ్ సుపరిడెంట్ శ్రీనివాస్ తెలిపారు. విచారణ సందర్భంగా అందరి కాల్ డేటా రికార్డింగ్స్ చేసిన ఎక్సైజ్ శాఖ.. నిందితుడు కెల్విన్ మొబైల్ ఫోన్ ను సైతం సీజ్ చేసింది.

కెల్విన్ తో స్టార్స్ కు ఉన్న సంబంధాల ఆధారాల కోసం స్టార్స్ కాల్ డేటా రికార్డింగ్స్ బయటికి తీసిన ఎక్సైజ్ శాఖ… ఈడి మాత్రం ఆ కాల్ రికార్డింగ్స్ ఇవ్వలేదు. ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ ల తో పాటు,ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్ ను ఇవ్వాలని కోరిన ఈడి.. వాటి వివరాలు ట్రైల్ కోర్ట్ లో ఉన్నాయని తెలిపింది ఎక్సైజ్ శాఖ. కోర్ట్ కు ఎక్సైజ్ శాఖ సమర్పించిన వాంగ్మూల కాపిలు మాత్రమే అందాయి అంటోంది ఈడి. అందులో కాల్ డేటా రికార్డింగ్స్ లేవని ఈడీ చెబుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version