ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రేపు పర్యటించనున్న జగన్

-

విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. ప్రతి ఏటా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన.. నాల్గో విడత నగదు ఆదివారం) రోజున తల్లుల ఖాతాలో జమ చేయనుంది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్. రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. తిరువూరులో ఏర్పాటు చేసే సభలో పాల్గొని… బటన్ నొక్కి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు.జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను సీఎం జగన్‌ విడుదల చేస్తారు. 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 700 కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Will start working from Vizag from July, AP CM Jagan Reddy announces in  cabinet meet | Cities News,The Indian Express

ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా… పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలు కూడా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం సాయం చేస్తున్నారు. భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందచేస్తుంది ఏపీ ప్రభుత్వం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news