ప్రతి ఒక్కరూ సీపీఆర్‌ అవగాహన కలిగి ఉండాలి : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రతి ఒక్కరికి సీపీఆర్‌(కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్) పై అవగాహన ఉండాలని తెలిపారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి సత్వరమే సీపీఆర్‌ అందిస్తే వారి ప్రాణాలు మనం రక్షించవచ్చు అని అన్నారు. వరంగల్ కలెక్టరెట్ కాన్ఫెరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సీపీఆర్‌ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెపోటు గాని శ్వాస తీసుకోలేని వ్యక్తుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం సీపీఆర్‌ పై శిక్షణను తెలిపారు. అత్యంత కీలకమైన సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో సీపీఆర్ ప్రక్రియను కొనసాగించక పోతే మూడు నుంచి నాలుగు నిమిషాలు తర్వాత ఆక్సిజన్ లేకపోవడంతో మనిషి బ్రెయిన్‌ డెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు ఎర్రబెల్లి.

CPR | సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి : మంత్రి ఎర్రబెల్లి-Namasthe Telangana

తెలంగాణ ప్రభుత్వం ఈ సీపీఆర్ పై హెల్త్ కేర్ వర్కర్స్, మునిసిపల్ ఉద్యోగులకు, పోలీస్ సిబ్బందికి, వాలంటీర్లు, షాపింగ్ మాల్ ఉద్యోగులకు, రెసిడెంట్ కాంప్లెక్స్ లకు సీపీఆర్‌, ఏఈడీపై శిక్షణ ఇస్తుందని తెలియచేసారు.వరంగల్ జిల్లాలో నలుగురు మెడికల్ ఆఫీసర్స్ హైదరాబాద్ లో సీపీఆర్ పై మాస్టర్ శిక్షణ తీసుకొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్దన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేశ్‌, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, సీపీ ఏ. వి. రంగనాథ్ , అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ, శ్రీ వాత్స తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.