ఈ తాబేలు గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

-

తాబేలు..ఈ పేరు వినగానే అందరికి తాబేలు, కుందేలు కథ గుర్తుకు వస్తుంది కదూ.. ఆ కథలో నిదానంగా వెళ్ళిన తాబేలు పరుగు పందెం లో గెలిచి కుందేలుకు తగిన గుణపాఠం చెబుతుంది. అయితే అదే నిజం కూడాను. అయితే ఆ కథ చదివినప్పటి నుండి కూడా తాబేలు ఈ భూమి మీద నెమ్మదిగా ప్రయాణించే ఓ జీవిగానే మనకు తెలుసు. అయితే అదంతా నిజం కాదండోయ్. అవును.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూస్తే అవాక్కవ్వాల్సిందే..

తాబేలు అంటే నెమ్మదిగా నడిచే జీవిగానే అందరికీ తెలుసు. కానీ ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం ఇప్పుడు వరకు మనం విన్న కథలను పటాపంచలు చేసేస్తుంది అని చెప్పాలి. ఏకంగా పరుగుల రారాజు హుస్సేన్ బోల్ట్ కి ఛాలెంజ్ విసిరేలాగే ఇక్కడ ఒక తాబేలు ఎంతో వేగంగా పరుగులు పెట్టింది. ఇది చూసిన వారు ప్రతి ఒక్కరు అవాక్కైపోతున్నారు..ఆ వీడియోను చూస్తే మీకే అర్థం అవుతుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తాబేలు ఇంత వేగంగా పరిగెత్తడం ఏంటి.. ఇది నిజమేనా.. అని నోళ్లెళ్లబెడుతున్నారు. ఈ వీడియో లో తాబేలు అప్పటి వరకు అందరికీ తెలిసిన విధంగా ఎంతో నెమ్మదిగా నడిచింది. అంతలోనే టాప్ గేర్ అందుకుంది. మెరుపు వేగంతో పరుగులు తీసి సెకన్ల వ్యవధి లో నీటిలోకి దూకి అదృశ్యం అయింది. అయితే ఈ తాబేలు వేగంగా కదిలిన తీరు చూసి వీడియో తీసిన వ్యక్తి సైతం షాక్ అవుతాడు..ఆ వ్యక్తి వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం తో నెటిజన్లు ఆశ్చర్యానికి గురైయ్యారు. అని చెప్పాలి.. గతంలో ఉన్న చరిత్రను ఇప్పుడు తాబేలు తిరగ రాసింది.. మొత్తానికి ఇది నెట్టింట చక్కర్లు కోడుతుంది..మీరు ఒకసారి చూడండి..ఒక లైకు వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news