జూబ్లీహిల్స్‌ పబ్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. వ్యంగ్యాస్త్రాలు సంధించిన రేవంత్‌ రెడ్డి…

-

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో ముందు నుంచి అధికార టీఆర్‌ఎస్‌పై విపక్షాలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. ఈ కేసులో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు ఉన్నందున నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షాలని వెల్లడించిన రేవంత్… ఈ రెండు పార్టీల పొత్తు అత్యాచారాల్లోనూ కొనసాగుతున్నట్టుంది అని అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు రేవంత్‌ రెడ్డి. కాగా, అత్యాచార ఘటనలో ఉపయోగించిన బెంజ్ కారు, ఇన్నోవా వాహనం ఎవరివో ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు రేవంత్‌ రెడ్డి. నిందితులు మైనర్లు అని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారని, మరి మైనర్లకు కార్లు ఇచ్చిన వాహన యజమానులపై ఎందుకు కేసు పెట్టడంలేదన్నారు రేవంత్‌
రెడ్డి.

Telangana Congress chief put under house arrest ahead of Bhupalpally visit  - India News

మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానులపై కేసు నమోదు చేయాలని మోటారు వాహనాల చట్టం చెబుతోందని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ ఈ కేసులో మోటారు వాహనాల చట్టం వీలుకాకపోతే, 16 ఆఫ్ పోక్సో చట్టాన్ని వర్తింపజేయాలని రేవంత్‌ రెడ్డి అన్నారు. అసలు, మే 28వ తేదీన ఘటన జరిగితే జూన్ 4న ఇన్నోవా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఇన్ని రోజుల పాటు ఆ వాహనం ఎక్కడుందని ప్రశ్నించారు. కారుపై ప్రభుత్వ వాహనం అని ఉన్న స్టిక్కర్ తొలగించింది ఎవరని నిలదీశారు. సీవీ ఆనంద్ చాలా విషయాలు వెల్లడించకుండా దాచినట్టు భావిస్తున్నామని రేవంత్ తెలిపారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కాంగ్రెస్ పార్టీ
కోరుకుంటోందని స్పష్టం చేశారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news