పటాన్‌చెరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. చిట్కుల్ గ్రామానికి చెందిన వెంకటేశ్ (34), రమేశ్ (35), మల్లేశ్‌ను ఎక్కించుకుని ద్విచక్ర వాహనంపై ఇస్నాపూర్ వచ్చి తిరుగు వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్, రమేశ్ మృతి చెందగా, మల్లేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం అతన్ని వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.