పెద్దపల్లి జిల్లాలో గల రామగుండం ప్రాంతంలోని సింగరేణిలో విషాదం చోటు చేసుకుంది. బొగ్గు గని పై కప్పు కూలి నలుగురు మృతి చెందారు. అంతే కాకుండా బొగ్గు గని పై పై కప్పు కింద మరో కొంత మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. కాగ పై కప్పు కింద ఉన్న వారిని కపాడటనికి అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగ ఈ ప్రమాదం సమయంలో అక్కడ దాదాపు 20 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగ ఈ ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు.. ఇప్పడే చెప్పలేమని సింగరేణి అధికారులు చెబుతున్నారు.
కాగ ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఒక అసిస్టెంట్ మేనేజర్ తో పాటు మరో ముగ్గురు కార్మికులు ఉన్నట్టు తెలుస్తుంది. వారి వివరాలు.. అసిస్టెంట్ మేనేజర్ – తేజ, ఆపరేటర్ – వెంకటేశ్వర్లు, వర్కర్ – రవీందర్, కార్మికుడు – నరేష్ తో పాటు వీరయ్య అనే సపోర్ట్ మెన్ ఉన్నట్టు తెలుస్తోంది. కాగ ఈ ప్రమాదంపై అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగే మృతుల సంఖ్య, వివరాలను కూడా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. కాగ ఈ ప్రమాదం అధికారుల నిర్షక్ష్యం వైఖరి వల్లే సంభవించిందని అనుమానిస్తున్నారు.