రైలు ప్రమాదాన్ని తప్పించి 100 ల మంది ప్రాణాలు కాపాడిన బామ్మ !

-

ఒక్కోసారి రెప్పపాటు సెకనులో రోడ్డు ప్రమాదాలు కానీ, రైలు ప్రమాదాలు కానీ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఎవరూ ఆపలేరు. కానీ మన కళ్ళముందే ప్రమాదం జరుగుతుంది అని తెలిసి .. దానిని ఆపలేకున్నా కనీసం మన వంతు ప్రయత్నం చేయడం మన బాధ్యత. సరిగ్గా ఈ మాటలు సూటయ్యే పనిని ఒక బామ్మ చేసి చూపించింది. కర్ణాటక రాష్ట్రంలో మంగళూరుకు చెందిన చంద్రావతి అనే ఒక పెద్దావిడ పెద్ద రైలు ప్రమాదాన్ని తప్పించింది. మంగుళూరు రైల్వే ట్రాక్ పై ఒక పెద్ద చెట్టు పడిపోయింది. ఇక ఏ ట్రైన్ వచ్చినా దూరం నుండి కనబడే ఛాన్స్ లేదు కాబట్టి కచ్చితంగా ప్రమాదం జరుగుతుంది.

కానీ ఈ చెట్టును గమనించిన చంద్రావతి ట్రైన్ వచ్చే వరకు అక్కడే ఉండి.. ట్రైన్ ను ఎలాగైనా ఆపాలన్న కసితో తన వద్దనున్న ఎర్ర బట్టతో రైలుకు ఎదురుగా విసురుతో వెళ్ళింది. అయితే లక్కీ గా ఆ సిగ్నల్ ను చుసిన లోకో పైలట్ ట్రైన్ ను నిదానంగా ఆపివేశాడు, ట్రైన్ లో ఉన్న వందల మంది ప్రయాణికులు కాపాడబడ్డారు. అయితే ఈ సంఘటన మార్చి నెల 21వ తేదీన జరుగగా నేడు వెలుగులోకి వచ్చింది. అధికారులు మరియు ప్రజలు ఈమెను అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version