ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి కవిత తరలింపు

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆమె ఇంటి నుంచి ORR మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. ఈ రాత్రికి ఆమెను అక్కడే ఉంచి.. రేపు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు.

కాగా,ఇవాళ ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version