ఆర్మీ సహాయంతో పడి ఉన్న ఏనుగుకు చికిత్స

-

ఉత్తరాఖండ్‌లో మోతీ అనే 35 ఏళ్ల ఏనుగు అనారోగ్యంతో కుప్పకూలింది. దీంతో చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లతో ఆ ఏనుగును కాపాడేందుకు ఆర్మీ సహాయంతో పైకి లేపారు. ఈ ఏనుగు ఎంతో మందిని తనపై ఎక్కించుకుని షికారు తిప్పింది. దాని కాళ్లు అరిగిపోవడంతో అనారోగ్యానికి గురైంది. జనవరి 22న ఒక ప్రాంతంలో కుప్పకూలింది. ఆహారం, చికిత్స లేక నీరసించిపోయింది. లేవలేని స్థితిలో ఉన్న ఆ ఏనుగు చికిత్స అవసరం అని ఎన్జీవో సంస్థ భావించింది. కాగా, వన్యప్రాణులను సంరక్షించే ఎన్జీవో సంస్థకు ఏనుగు పరిస్థితి తెలిసింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఎమర్జెన్సీ బృందం వెంటనే ఏనుగు పడి ఉన్న చోటుకు వెళ్లింది. మెడికల్ టీం గత కొన్ని రోజులుగా దానికి చికిత్స చేస్తున్నారు.

అయితే ఆ ఏనుగు చాలా రోజులుగా ఒకవైపు పడి ఉండటంతో చికిత్స అందించేందుకు ఎన్జీవో బృందానికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ సహాయాన్ని ఆ ఎన్జీవో సంస్థ కోరింది. దీంతో మోతీ చికిత్సకు సహకరించేందుకు బెంగాల్‌కు చెందిన ఆర్మీ ఇంజినీర్లు ముందుకు వచ్చారు. 24 గంటల్లో ప్రత్యేక టవర్‌ కట్టారు. ఆ ఏనుగు తన కాళ్లపై నిలబడేందుకు ప్రత్యేక పుల్లీలను ఏర్పాటు చేశారు. దీంతో వైద్య బృందం దానికి తగిని విధంగా చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఆర్మీ సహాయానికి ఆ ఎన్జీవో సంస్థ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. అసాధ్యమైన పనిని ఐక్యతతో కొంతమేర సాధ్యం చేసినట్లు చెప్పింది. దీనికి సంబంధించిన ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version